mt_logo

కొలంబస్ లో మార్మోగిన తెలంగాణం

తెలంగాణం 2015 పేరిట అమెరికాలోని కొలంబస్ నగరంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సంబరాలు అంబరాన్ని అంటాయి. అమరులకు నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి పూల దండ వేసి కార్యక్రమాన్ని ప్రారంభిచారు. కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ (CTA) అధ్యక్షుడు రామకృష్ణ కాసర్ల, ఉపాధ్యక్షుడు నవీన్ కానుగంటి స్వాగతోపణ్యాసం చేసారు.

నటి యాంకర్ అనసూయ కార్యకరమానికి వాఖ్యాతగ వ్యవహరించారు. ప్రముఖ గాయకుడు జనార్ధన్ పన్నెల తన పాటలతో సభికులను అలరించారు. తెలంగాణ ఆట పాట, భరతనాట్యం, ధూమ్ ధామ్, నాటకాలు, స్కిట్స్, ఫాషన్ షో, మ్యూజిక్ మస్తి మొదలగు 40 రకాల కార్యక్రమాలని ప్రదర్శించారు. రాణి రుద్రమ దేవి స్కిట్, పిల్లలు పెద్దలు కలిసి చేసిన ఫాషన్ షో ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను వ్యాప్తికి కృషి చేస్తున్న తెలంగాణం నిర్వాహకులను పలువురు అభినందించారు.

తెలంగాణ ఆవతరణ దినోత్సవ కార్యక్రమ నిర్వాహకులు చాలా ఘనంగా జరిపారు
కార్యక్రమ నిర్వహణకు CTA నాయకులు, కమిటి సభ్యులు అహో రాత్రులు కృషి చేసారు.

కొలంబస్ తెలంగాణ అసోసియేషన్(CTA) వారు నిర్వహించిన ఈ వార్షిక సాంస్కృతిక సంబరాల్లో 1000కు పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *