mt_logo

సీఎం కేసీఆర్ తో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం

సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రైతుల పంట రుణమాఫీపై చర్చించారు. వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

మరోవైపు ఆపద్భందు పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 21 లక్షల రూపాయల చొప్పున 2 కోట్ల 10 లక్షల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చెరువుల సర్వే పూర్తయింది. మూడురోజులపాటు సర్వే చేసిన చిన్న నీటిపారుదల శాఖాధికారులు రాష్ట్రంలో 41, 130 చెరువులు ఉన్నట్లు గుర్తించి ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. సర్వే ద్వారా గుర్తించిన చెరువులు, కుంటల్ని మరమ్మత్తులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *