తోడబుట్టిన అన్నా చెల్లెల్లు అక్కా తమ్ముల్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ బంధన్ (రాఖీ పౌర్ణమి) పండుగ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీల పండుగ తెలియజేస్తుందని సిఎం తెలిపారు. భారతీయ సంస్కృతికి, జీవనతాత్వికతకు రాఖీ పండుగ వేదికగా నిలుస్తుందని సీఎం తెలిపారు. రాఖీని రక్షా బంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదని అన్నారు. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలువాలని అక్కాచెల్లెల్లు ఆకాంక్షిస్తారని సీఎం తెలిపారు.
మానవ సంబంధాలను, కుటుంబ అనుబంధాలను మరింతగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ కొనసాగుతున్నదన్నారు. మానవీయ పాలనే లక్ష్యంగా అమలు చేస్తున్న పలు పథకాలు వృద్దులు తదితర రక్షణ అవసరమైన వర్గాలకు భరోసానందిస్తున్నాయన్నారు. సంపదను సృష్టించి సకలజనులకు పంచుతూ కొనసాగుతున్న ప్రగతి ప్రస్థానం రాష్ట్ర ప్రజల నడుమ సహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తూ, సహోదర భావాన్ని పెంచుతున్నదని సిఎం అన్నారు.
అనేక పథకాలను అమలు చేస్తూ, మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసానందిస్తూ, పెద్దన్నలా రక్షణగా నిలిచిందని సిఎం అన్నారు. ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, విజయ ప్రస్థానాన్ని సాగిస్తూ, దేశానికే దిక్సూచిగా నిలిచారని అన్నారు. రాఖీ పండుగను ప్రజలంతా ప్రేమానురాగాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
- CWC rejects DPRs of 3 irrigation projects due to Congress government’s apathy
- Congress targets KTR with baseless slander and orchestrated misinformation campaigns
- KTR slams Rahul Gandhi for double standards on Adani issue
- Demolitions, DPR discrepancies, varying costs: Musi beautification project mired in controversy
- Kavitha exposes Congress party’s deceit on Musi beautification project
- భూభారతి చట్టం భూహారతి అయ్యేటట్లు కనిపిస్తుంది: కవిత
- రైతుభరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 26,775 కోట్లు బాకీ పడ్డది: కేటీఆర్
- ఫార్ములా-ఈ కేస్ ఎఫ్ఐఆర్లో కావాల్సినంత సరుకు లేదు.. కేటీఆర్‌ని అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
- హైకోర్టు ఉత్తర్వులతో ఫార్ములా-ఈ కేస్ డొల్లతనం తేటతెల్లమైంది: హరీష్ రావు
- ఫార్ములా-ఈ కేసులో అణాపైసా అవినీతి లేదు.. న్యాయపరంగా ఎదుర్కొంటాం: కేటీఆర్
- అక్రమ కేసులకు, అణిచివేతలకు, కుట్రలకు భయపడకుండా కొట్లాడుతూనే ఉంటాం: కేటీఆర్
- ఫార్ములా-ఈ మీద అసెంబ్లీలో చర్చ పెట్టే దమ్ము రేవంత్‌కు లేదు: కేటీఆర్
- భూభారతి పత్రికా ప్రకటనలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిన బీఆర్ఎస్
- స్థానిక సంస్థల బిల్లులో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం లేకపోవడంపై బీఆర్ఎస్ అభ్యంతరం
- ఆదానీకి ఏజెంట్‌గా రేవంత్ కొమ్ముకాస్తున్నాడు: హరీష్ రావు