పోచారం శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్..

  • February 7, 2019 2:00 pm

శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు బాన్సువాడ మండలం పోచారంలో పరామర్శించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి పాపవ్వ(107) మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఈరోజు ప్రత్యేక హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్టు నుండి బాన్సువాడ చేరుకొని అక్కడనుండి రోడ్డు మార్గం ద్వారా పోచారం ఇంటికి వెళ్లారు. అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాపవ్వ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఎంపీ కవిత, మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు కూడా పోచారంను పరామర్శించిన వారిలో ఉన్నారు.


Connect with us

Videos

MORE