శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి పాపవ్వ ఈనెల 5వ తేదీన స్వర్గాస్తురాలయిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆమె ద్వాదశ దినకర్మ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి చేరుకొని పాపవ్వ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు.
సీఎం కేసీఆర్ తో పాటు హోం మంత్రి మహమూద్ అలీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, ఎంపీ వినోద్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాపవ్వ చిత్రపటానికి నివాళులు అర్పించారు.