తెలంగాణ వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి ఐటీ మంత్రి కేటీఆర్, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ తదితరులు హాజరయ్యారు. వివిధ శాఖల ఇంజినీర్లందరినీ వాటర్ గ్రిడ్ ఏర్పాటులో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా గ్రిడ్ ను పట్టణాలు, మున్సిపాలిటీలు, నగరాలు, గ్రామాలకు అనుసంధానం చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది.
సమావేశంలో జిల్లాల వారీగా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు రూపొందించిన అంచనావ్యయాలపై చర్చించనున్నారు. గ్రిడ్ పై తుదినిర్ణయం జరిగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. గ్రిడ్ విస్తీర్ణం, సర్వే ఎలా నిర్వహించాలి? ఎన్ని రోజులు నిర్వహించాలి? అంచనా వ్యయం ఎంత? అనే అంశాలపై సమీక్షలో చర్చించే అవకాశముంది.