ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యుత్ శాఖపై సమీక్షా సమావేశాన్ని ఈరోజు సచివాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, హరీష్ రావు తో పాటు జెన్ కో, ట్రాన్స్ కో ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అనంతరం వ్యవసాయ శాఖపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వ్యవసాయాధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఖరీఫ్ కు సిద్ధం కావాలని, విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సాయంత్రం డిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఎల్లుండి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం ప్రధాని మోడీతో సమావేశమవ్వనున్నారు.