సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఆయన వారసుడు సతీష్ రెడ్డికి టీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్ టికెట్ కన్ఫర్మ్ చేశారు. తండ్రి ఆశయ సాధన కోసం ఆయన తనయుడు గులాబీ పార్టీ తరపున ఉప ఎన్నిక బరిలో నిలబడనున్నారు. బీజేపీ ఇప్పటికే రఘునందన్ రావును తమ అభ్యర్ధిగా ప్రకటించగా, టీజేఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్ధుల వేటలో ఉన్నాయి.
ఇదిలాఉండగా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయని, కరోనా కష్టకాలంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఎటువంటి భంగం కలగకుండా ప్రజలను ఆదుకుంటున్నదని, దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు తమదేనని, వార్ వాన్ సైడే అని అంటున్నాయి గులాబీ శ్రేణులు.
పోరుబాట నుండి మొదలుకొని ఆయన తుదిశ్వాస వరకు ప్రజల కష్టాలు తీర్చడానికే కృషిచేశారు. 25 ఏళ్ళు జర్నలిస్టుగా పని చేశారు. ఆ తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ తో కలిసి ఉద్యమంలో పాల్గొని రాజకీయాల వైపు అడుగుపెట్టారు. 2004 నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఇప్పటివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఏది చేసినా ప్రజల కోసమే. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ పరిగెత్తే ఆయన ప్రజలలో ఒక్కడిగా, ప్రజలే తానుగా దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. సీఎం కేసీఆర్ సోలిపేట రామలింగారెడ్డికి శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్ గా పదవిని కట్టబెట్టారు. వరుసగా రెండోసారి కూడా ఇదే పదవిని కట్టబెట్టారు. ఉద్యమసమయంలో రామలింగారెడ్డి మీద వందల కేసులు ఉండేవి. రామలింగారెడ్డి మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన స్వస్థలం దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామం వెళ్ళి ఆయనకు నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే సోలిపేటతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని సీఎం కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం వారికి అన్నివేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన వారసుడు సతీష్ రెడ్డికి టీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్ టికెట్ కన్ఫర్మ్ చేశారు.