ఈనెల 23 నుండి శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం రాత్రి గవర్నర్ నరసింహన్ తో రాజ్ భవన్ లో సమావేశం అయ్యారు. గణేష్ నిమజ్జనం, యూనివర్సిటీలకు చాన్సలర్లు, వైస్ చాన్సలర్ల నియామకం, వర్సిటీల చట్టంలో తీసుకోవలసిన మార్పు, రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చైనా పర్యటన విశేషాలు తదితర అంశాలపై గవర్నర్ తో సీఎం కేసీఆర్ దాదాపు 2 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు.
గణేష్ నిమజ్జనం, బక్రీద్, అసెంబ్లీ సమావేశాలు మూడూ ఒకే సమయంలో రావడం వల్ల శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను గవర్నర్ కు సీఎం వివరించారు. ఛత్తీస్ గడ్, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు కేంద్రం నుండి అదనపు బలగాలను రప్పిస్తున్నట్లు సీఎం తెలిపారు.