బంజారాహిల్స్ రోడ్ నెం. 12 లో జరిగిన మహారాజా అగ్రసేన్ జీ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని అగ్రసేన్ జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వైశ్యులు సమాజంలో గొప్ప పాత్ర పోషిస్తున్నారని, వారు సమాజానికే ఆదర్శమని ప్రశంసించారు. హార్ట్ ఆఫ్ లైఫ్ అంటే ఏమిటో వైశ్యుల నుండి తెలుసుకోవచ్చన్నారు. 1969 ఉద్యమంలో బేగం బజార్ మార్వాడీలు గొప్ప పాత్ర పోషించారని గుర్తు చేశారు.
కాస్మోపాలిటన్ కల్చర్ కు గుల్జార్ హౌజ్ నిదర్శనమని, భవిష్యత్ లో హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తుందని, దేశంలోనే ఉన్నత స్థానంలో రాష్ట్రాన్ని నిలుపుతామని పేర్కొన్నారు. భవిష్యత్ లో వ్యాపారులపై ఎలాంటి వేధింపులు ఉండవని, త్వరలోనే అత్యుత్తమ పారిశ్రామిక పాలసీని అమలు చేస్తామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.