శుక్రవారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహమ్మద్ సలీం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్య, ఉపాథి రంగాల్లో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు.
మైనారిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, బడ్జెట్ కేటాయింపుల్లో ముస్లింల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం తో పాటు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, రవాణా మంత్రి మహేందర్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, పలువురు ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు హాజరయ్యారు.