mt_logo

కార్టూనిస్ట్ పామర్తి శంకర్ ను అభినందించిన సీఎం కేసీఆర్

పోర్చుగల్ కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ప్రపంచస్థాయిలో ప్రతి ఏటా ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు ఇచ్చే గ్రాండ్ ప్రిక్స్ అవార్డు ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి చెందిన పామర్తి శంకర్ కు దక్కింది. అవార్డు శంకర్ కు దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గ్రాండ్ ప్రిక్స్ అవార్డు ఆసియాకు చెందిన వారికి దక్కడం ఇదే మొదటిసారి కావడం, అదీ తెలంగాణకు చెందిన వ్యక్తికి దక్కడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి పామర్తి శంకర్ ను అభినందించారు. తెలంగాణకు చెందిన వ్యక్తులు అన్ని రంగాల్లో రాణించాలని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరోవైపు పీఎస్ఎల్వీ – 26 విజయవంతం అయిన సందర్భంగా ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ ను సీఎం కేసీఆర్ అభినందించారు. ప్రతి ప్రయోగం విజయవంతం చేస్తూ ఇస్రో దేశానికే గర్వకారణంగా మారిందని, భవిష్యత్ లోనూ ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *