mt_logo

సీఎం ఎన్నిరకాలుగా కుట్రలు చేసినా తెలంగాణ ఆపలేరు.

శుక్రవారం నాడు మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండలో ఒక సభలో పాల్గొనడానికి వచ్చిన టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేరని, బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరక్కుండా చేస్తున్న సీఎంను తెలంగాణ మంత్రులు ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. ముగ్గురు బాబులను సీమాంధ్రకు తరిమి తరిమి కొట్టాలన్నారు. తెలంగాణ ప్రాంత టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు వారి అధినేతలను నెత్తిపై పెట్టుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ నేతలకు ఎన్ని రకాలుగా అవమానం ఎదురైనా సిగ్గులేకుండా ఊరుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *