వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని చేవెళ్ళ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం పూడూరు మండలం కంకల్ గ్రామంలో పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు.. నినాదంతో ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తనను ఎంపీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని, తనను గెలిపిస్తే ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు.
అనంతరం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి 2004 నుండీ టీఆర్ఎస్ లో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇంచార్జి బాబురావు, టీఆర్ఎస్ యువజన నాయకుడు కే అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.