ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధుల నుండి విశేష స్పందన లభిస్తున్నది. తన పుట్టిన రోజున శాలువాలు, బొకేలు తేవొద్దని, పేదల ముఖాల్లో చిరునవ్వులు పూయించండని కేటీఆర్ సూచించగా స్పందించిన ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్సుల కొనుగోలు కోసం మంత్రి కేటీఆర్ కు చెక్కుల రూపంలో అందించారు. వాటితో కొనుగోలు చేసిన పలు అంబులెన్సులను ఇటీవలే మంత్రి కేటీఆర్ ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలతో కలిసి ప్రారంభించారు. తాజాగా మునుగోడు నియోజకవర్గానికి రెండు అంబులెన్సుల కొనుగోలుకోసం రెండు చెక్కులను(రూ. 50 లక్షలు) మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రీజెన్సీస్ అధినేత ఇంద్రసేనా రెడ్డితో కలిసి హైదారాబాద్ లో మంత్రి కేటీఆర్ కు అందజేశారు. రెండు అంబులెన్సులకోసం చెక్కులు అందజేసిన వారిని మంత్రి కేటీఆర్ అభినందించారు.