బిల్కిస్ బానోస్ అత్యాచార నిందితులను కేంద్ర ప్రభుత్వమే విడుదల చేయించిందన్న వార్తలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇదొక షాకింగ్ విషయమన్న ఆయన.. బీజేపీ కుటిల రాజకీయాలపై మండిపడ్డారు. ఇప్పటి వరకు గుజరాత్ ప్రభుత్వమే ఈ ‘సంస్కారవంతులైన రేపిస్టులను’ విడుదల చేసిందని వార్తలొచ్చాయని, కానీ తీరాచూస్తే కేంద్ర ప్రభుత్వమే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలియడం చాలా షాకింగ్ గా ఉందని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది బీజేపీ చవకబారు చర్య అని మండిపడ్డ కేటీఆర్… రేపిస్టులు, పసివాళ్లను చంపే దుర్మార్గులను కేవలం రాజకీయ లబ్ధి కోసం విడుదల చేయడం అనేది.. బీజేపీకి నీచమైన విలువలకు నిదర్శనం అన్నారు. బీజేపీ ఈ పని నీచాతినీచం’’ అని కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వ చర్యను నెటిజన్లు తీవ్రంగా తప్పు బడుతూ కేటీఆర్ మాటలతో ఏకీభవిస్తున్నారు.