mt_logo

రాష్ట్రపతి పాలన ఉండే అవకాశం

రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో కేంద్రప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చెయ్యట్లేదు. రాష్ట్రపతి పాలనకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. శుక్రవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కేంద్ర కేబినెట్ అజెండాలో టేబుల్ ఐటంగా రాష్ట్రపతి పాలన అంశాన్ని చేరుస్తారు. కేంద్ర హోం శాఖ ఈ విషయమై ఒక నోట్ ను కూడా సిద్ధం చేసింది. ఇప్పుడున్న తాజా రాజకీయ పరిణామాల మధ్య ఏ ప్రాంతం వ్యక్తిని సీఎం గా ఎన్నుకోవాలనేది ప్రశ్నార్ధకంగా మారింది. సామాజిక వర్గం విషయంలోనూ అదే సందిగ్ధత నెలకొనడంతో ఇన్నిరోజులూ ఎటూ తేల్చుకోలేకపోయింది. చివరికి రాష్ట్రపతి పాలనకే అనుకూలంగా ఉన్నట్లుగా తెలిసింది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న సమయంలో విభజన ప్రక్రియ ఎలక్షన్లకు ఏమాత్రం అడ్డు కాదని, అవసరమైతే ఎన్నికలు జరిగాక రెండు అసెంబ్లీలను ఏర్పాటు చేసుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ వివరించింది. అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పడంతో మూడు నెలల కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల లాభం ఏమీ లేదని భావించి కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపుతున్నట్లు కీలక సమాచారం అందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *