mt_logo

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో తెలంగాణకు మొండిచేయి

తెలంగాణాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామీని గాలికి వదిలేసి మహారాష్ట్రలోని లాతూర్ లో మాత్రం కోచ్ ఫ్యాక్టరీని శరవేగంగా పూర్తి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలోను కోచ్ ఫ్యాక్టరీలు అవసరం లేదని, ఇప్పటికే ఉన్నవి సరిపోతాయని తేల్చి చెప్పిన కేంద్రం మహారాష్ట్రకు మినహాయింపు ఇస్తూ దానికి బడ్జెట్ కేటాయింపులు కూడా పూర్తి చేసి దాదాపు దాని నిర్మాణం పూర్తయ్యే స్థితికి చేర్చింది. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తామని 2010లో రైల్వే బడ్జెట్ లో కేటాయింపులు చేశారు అప్పటి రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ. అయితె రాష్ట్ర ప్రభుత్వం సికిందరాబాద్ లో తగినంత స్థలం కేటాయించడం కష్టం అవుతుందని 2011-2012లో ఖాజీపేటలో 40 ఎకరాలు కేటాయించింది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కూడా తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. తరువాత మాట మార్చిన కేంద్రం, కొత్త వ్యాగన్ ఫ్యాక్టరీలు అవసరం లేదని, భవిష్యత్తు అవసరాలకు ఇప్పుడున్నవే సరిపోతాయని ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలిపి వేసింది. ఇందుకు విరుద్దంగా 2018 లో మహారాష్ట్రలోని లాతూర్ కు రైల్వే బోర్డు వ్యాగన్ ఫ్యాక్టరీ మంజూరు చేయగా.. కేంద్రం దానికి రూ.625 కోట్లు కేటాయించి అందులో రూ.587 కోట్లు విడుదల చేసి ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయించినట్టు సమాచార హక్కు కార్యకర్త ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానం ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *