mt_logo

ఉద్యమానికి కులచీడ!

– తెలంగాణ ఆవాజ్

రెడ్డి కాంగ్రెస్ పిచ్చిలో.. ఉచ్చులో తెలంగాణ నుంచి కూడ చాలామందే పడుతున్నరు. డబ్బు యావతోనో.. కులపిచ్చితోనో ఈ మరుగుజ్జు నేతలు చాలామంది ఘరానా అవినీతిపరుడిని నెత్తినెక్కించుకుంటున్నారు. కొందరు తెలంగాణ రెడ్డి నేతల తీరు చూస్తుంటే ఉద్యమానికి కులచీడ పడుతుందేమోనన్న అనుమానం తెలంగాణవాదుల్లో కలుగుతోంది. ఈ రెడ్డి నేతల ధీమా ఏంటో నాకు అర్థం గావడం లేదు. ద్రోహులుగా నిలిచిపోయినా..చరిత్రహీనులుగా పేరుబడ్డా.. అవినీతిపరుడి భజనను మాత్రం వీడమంటూ ఒక్కొక్క నక్క ఒక్కొక్క రీతిగా తమ ముసుగు తొలగించి జంప్ అవుతుండ్రు.

చంచల్ గూడ జైల్లో పార్టీ ఆఫీస్ పెట్టి.. తాను దోచుకున్న సొమ్మును వెదజల్లి గీ జగన్ రాజకీయాలు నడుపుతుండు. అతను చేసిన కుంభకోణాలకు లెక్కేలేదు. ఎంతోమంది సన్న రైతుల భూములను దిగమింగి.. పారిశ్రామికవేత్తలకు కానుకగా ఇచ్చి తన కంపెనీలకు నిధులు మళ్లించుకుండు. లక్షల కోట్లు దోచిండు. సీబీఐ దర్యాప్తు గనుక లేకపోతే ఈ పాటికి రాష్ట్రాన్ని కూడా అమ్మేసే ఘనాపాఠి.
అంతటి టక్కరిని సమర్థిస్తున్న ఈ నేతలంతా రేపొద్దున్న అందినకాడికి ప్రజాసొమ్మును దోచేయరన్న గ్యారంటీ లేదు. జగన్ పక్షం ఎవడైనా నిలుస్తున్నడంటే వాడి శీలాన్ని శకించాల్సిందే.

నిజాయితీ లేనోడు.. ప్రజాధనాన్ని దోచి పైకి రావాలనుకున్నడో.. ఎన్ని కోట్లు దోస్తే.. అంతపెద్ద నే(మే)త అవుతాడని నమ్మేవాళ్లే జగన్ భజనమేళంలో చేరుతున్నరు. ఈ అవినీతి మంద గనుక అధికారంలోకి వస్తే.. ఇంక ప్రజాధనమంటూ ఏమన్నా ఉంటుందా? ప్రజాస్వామ్యానికి విలువు ఉంటుందా? నీతి అనే పదానికి భూతద్దం పెట్టి వెతికినా అర్థం దొరుకుతుందా? ఏం నీతి ఉంది జగన్ కి? సీఎం తనయుడైన ఈయనగారి ఒక్కరి స్వార్థానికి వాన్ పిక్, ఫ్యాబ్ సిటీ, లేపాక్షి నాలెడ్జ్ హబ్, బ్రాహ్మణీ స్టీల్స్, బయ్యారం గనులు, వేలాది భూములు, బెంగళూరు రాజభవనాలు, లోటస్ పాండ్ లో లెక్కలేనన్ని గదుల రాజసౌధాలు.. అనేక అవినీతి తంతులు.. ఒక్కటా రెండా.. వైఎస్ హయాంలో ఏ బొక్కలో వేలు పెట్టినా దాని వెనుక దాగిన మహాఘనుడు, వ్యాపారవేత్త, అపర చాణక్యుడు జగన్ గారే బయటపడతారు. ఓబుళాపురం గనులు, ఎమ్మార్ కుంభకోణం, నాదర్ గుల్ భూములు.. అయ్యా తమరి అవినీతి చరిత్ర రాబోవు రాజకీయ తరాలకు ఆదర్శ గ్రంథమయ్యే అరిష్టం దాపురించింది.

మహా ఘనాపాఠి గజదొంగవని..జగన్ ను తీస్కపోయి జైల్లో పెడితే..బీహార్ రాజకీయ నేరస్తులను (పప్పూ యాదవ్ తదితరులను) మించిపోయే రాజకీయాలను కటకటాల వెనుక నుంచే నడుపుతున్నావు. గ్రేట్ హిట్లర్, ముస్సోలీన్ కు కూడా ఇన్ని తెలివితేటలు లేవనుకుంట. అలాంటి జగన్ అవినీతి పాపాలను మోస్తూ.. ప్రజల నోళ్లు కొట్టి సంపాదించిన డబ్బుకు ఆశపడి.. నీచాతినీచంగా ఉద్యమానికి వెన్నుపోటు పొడుస్తున్న మహాశయుల ధీమా చూస్తుంటే మాత్రం నాకు ముచ్చటేస్తోంది. తెలంగాణ ఉద్యమం ఒక మహా శిఖరమైంది. ఈ మరుగుజ్జు పొట్టేళ్లు ఎన్ని ఢీకొన్నా ఉద్యమాన్ని నీరుగార్చలేవు. ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీయలేవు. ఎన్నికల్లో మభ్యపెట్టడానికి వస్తున్న ఈ ద్రోహలను గల్లాపట్టి నిలదీస్తే చాలు.. ఈ కుట్రలు ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తే చాలు.. తెలంగాణకు ఎలాంటి ఢోకా లేదు.

వాస్తవానికి చూస్తే తెలంగాణ ఉద్యమానికి ఈ కులగజ్జే పెద్ద ప్రమాదంగా కనిపిస్తోంది. ఓ వైపు రెడ్డి గజ్జీతనం కలరా, క్యాన్సర్ ను మించి రెచ్చిపోయి వీరంగమేస్తుంటే.. మరోవైపు సీమాంధ్ర కమ్మ కుల గజ్జీ ఎయిడ్స్ లెక్క పాకుతోంది. కమ్మ గజ్జీ తీట చాలా ఎక్కువున్న మీడియా పెద్దలు రామోజీ (ఈనాడు,ఈటీవీ2), వేమూరి రాధాకృష్ణ (ఆంధ్రజ్యోతి, ఏబీఎన్) రవిప్రకాశ్ (టీవీ9) నరేంద్ర చౌదరీ (ఎన్టీవీ) పచ్చిపచ్చిగా తెలంగాణ ఉద్యమంపై దాడి చేస్తనే ఉన్నరు. వీళ్ల లక్ష్యం పాడే మీద ఉన్న టీడీపీని నేరుగా అధికారం పీఠంమీద కూర్చొబెట్టడం. అష్టవంకరులన్న అమాస చంద్రుడికి పట్టం గట్టి.. ఆ అధికారంతో తాము కులకడం..అందుకోసం ఎంతకైనా బరితెగిస్తారు. కావాలంటే వేమూరిని చూడండి చంద్రుడి మీద మోజుతో ఎంత బరితెగించి పిచ్చిరాతలు రాస్తున్నాడో చంద్రయాన్ పేరిట. . ఇది కూడ జర్నలిజమేనా బై.

ఇగ జగన్ సాక్షి పత్రిక, టీవీల గురించి చెప్పనక్కరలేదు. ఏ జనహితం కోసం ఈ దరిద్రంగొట్టు జర్నలిజం.. ఈ ఘనాపాఠీలు ఎన్నడూ చెప్పరు. ఈ సీమాంధ్ర రాబందుల దండు ఎడతెరిపి లేకుండా తెలంగాణపై దండయాత్ర చేస్తనే ఉంటంది. ఎన్నికల వరకు ఎలా వీలయితే అలా..

ఏం బతుకులు మీవి. 850 మంది పసిపోరలు పానాలు దీస్కోని.. ప్రత్యేక రాష్ట్రం కావాలంటుంటే.. ఇన్ని దుష్టశక్తులు, ఇన్ని దుష్ట ప్రభావాలు,కుట్రలతో అడ్డుకోవాలని చూస్తున్న మీకు తెలంగాణ తల్లుల ఉసురుముట్టకపోదు. ఎన్నికల్లో చావుదెబ్బ తప్పదు. ఇది కన్నబిడ్డలను కోల్పోయి కడుపుకోత అనుభవిస్తున్న తెలంగాణ తల్లుల సాపెన.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *