గచ్చిబౌలిలోని ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ను ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆస్పత్రులు పనిచేయాలన్నారు. క్యాన్సర్ సెంటర్ లో ఎన్నో అధునాతన సదుపాయాలున్నాయని, ఈ ఆస్పత్రి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు.
కాంటినెంటల్ ఆస్పత్రికి బ్రాండ్ అంబాసిడర్ గా తానే ఉంటానని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ఆస్పత్రి ఉందని ప్రశంసించారు. హైదరాబాద్ ను టూరిస్ట్, హెల్త్, మెడికల్, ఇండస్ట్రీ హబ్ గా రూపుదిద్దుతామని చెప్పారు. మరోవైపు వరంగల్ లో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కార్యాలయం కాకతీయ యూనివర్సిటీలో ప్రారంభం అయ్యింది. వీసీగా ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా బాధ్యతలు స్వీకరించారు.