mt_logo

ఏపీఎన్జీవోల సభను రద్దు చేయాలి-హరీష్ రావు

తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చిందని, సభలో ఏమైనా అవాంచనీయ సంఘటనలు జరిగితే సీఎం, అశోక్ బాబు, పర్మిషన్ ఇచ్చిన పోలీసులదే బాధ్యత అని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు హెచ్చరించారు. ఇప్పటికైనా అనుమతి రద్దుచేయాలని పోలీసులను కోరారు. ఏపీఎన్జీవోల చలో హైదరాబాద్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదముందని, నిరంకుశ కుట్రలకు మరో ఉదాహరణ అని పలువురు టీవాదులు అభిప్రాయపడ్తున్నారు. అసెంబ్లీలో తెలంగాణపై చర్చ జరుగుతున్న సమయంలో ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇవ్వడం ప్రభుత్వ తప్పిదమని, ఏమైనా ఉద్రిక్తతలు చోటుచేసుకుంటే ప్రభుత్వమే బాధ్యత వహించాలని పొంగులేటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అశాంతిని రేకెత్తించడానికే ఏపీఎన్జీవోల సభకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఈ సమయంలోనే తెలంగాణ ప్రజలు సంయమనంతో ఉండాలని తెలంగాణ విద్యుత్ జేఏసీ నేత కే రఘు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *