mt_logo

తెలంగాణ బిల్లు ఆమోదించిన కేంద్రకేబినెట్

తెలంగాణ ప్రక్రియలో మరో కీలక ఘట్టం ముగిసింది. ప్రధాని మన్‌మోహన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ఈ రోజు సాయంత్రం బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్, జైరాం రమేష్, కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, చేనేత జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ బిల్లుపై సవరణలు, డిమాండ్లను పరిశీలిస్తున్నారు. దాదాపు రెండు గంటలపాటు తెలంగాణ బిల్లుపై చర్చించిన అనంతరం కేంద్ర మంత్రులు బిల్లుకు ఆమోదం తెలిపారు. సమావేశం జరిగిన అనంతరం కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు చెప్పారు. హైదరాబాద్ యూటీ చేయాలనే ప్రతిపాదనను కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. మరికొద్దిసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి సుషీల్ కుమార్ షిండే అన్ని వివరాలూ తెలియచేస్తారని సమాచారం. రాష్ట్ర విభజన ప్రక్రియ ఇక జెట్ స్పీడ్‌తో ముందుకు సాగనుంది. ఈనెల 10 న పార్లమెంటుకు బిల్లును పంపించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *