mt_logo

బీజేపీతో పొత్తు అవసరం చంద్రబాబుకే – హరీష్ రావు

పొత్తులు లేకుండా చంద్రబాబు ఏనాడూ ప్రజలవద్దకు ఒంటరిగా వెళ్లి పోటీ చేయలేదని, వామపక్ష పార్టీలను వాడుకుని వదిలేశాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. చంద్రబాబులాగా మాటలు మార్చి పబ్బం గడుపుకునేవారు ప్రపంచంలో ఎవరూ ఉండరని, మామ దగ్గరికి తీస్తే ఆయననే వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన బాబును ప్రజలు నమ్మరని విమర్శించారు. బీజేపీతో అవసరం భారతదేశానికా? లేక తెలుగుదేశానికా? అని ప్రశ్నించారు. భారతదేశంలో సంక్షోభం లేదు. తెలుగుదేశంలోనే సంక్షోభం ఉందని చంద్రబాబు చెప్పుకోవాలని హరీష్ రావు సూచించారు. తెలుగుదేశం పార్టీని కాపాడటం ఎవరివల్లా కాదని, బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఆత్మహత్యాసదృశమైనదిగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబు స్వయంప్రకాశం లేని చంద్రుడని, మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి బెల్టుషాపులను బార్లా తెరిచింది చంద్రబాబేనని మండిపడ్డారు. చంద్రబాబు సీమాంధ్ర  సీఎం అయితే బీజేపీతో కలిసి తెలంగాణకు గండికొడతాడని, మోడీని అడ్డుపెట్టుకుని చంద్రబాబు లాభం పొందాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *