టీడీపీతో పొత్తుపెట్టుకోవడమంటే పార్టీని చేతులారా నాశనం చేసుకోవడమేనని రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడాన్ని కిషన్ రెడ్డి, నాగం జనార్ధనరెడ్డి లాంటి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం మోడీని ప్రధానిగా చేయడానికి 272 లోక్ సభ సీట్లు గెలుచుకోవడానికి ‘మిషన్ 272‘ ప్రవేశబెట్టి తద్వారా ప్రాంతీయ పార్టీలతో పొత్తులకోసం ప్రయత్నించడం ఇప్పటికే మొదలైంది. టీడీపీతో పొత్తు కోసం వెంకయ్యనాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ విషయమై తొందరపడవద్దని కిషన్ రెడ్డి మంగళవారం జాతీయాధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు.
తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ మద్దతు పలకడంతో తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, ఇప్పుడు చంద్రబాబుతో పొత్తుతో మళ్ళీ పతనమవుతుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు.