mt_logo

బిల్లును వెనక్కుపంపలేరు-జస్టిస్ సుదర్శన్‌రెడ్డి

రాష్ట్రపతి పంపిన తెలంగాణ బిల్లును అడ్డుకునే ప్రయత్నాలలో భాగంగా బిల్లును వెనక్కు పంపాలని ప్రభుత్వం తరపున సీఎం కోరడం అర్థరహితమని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి బీ.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. బిల్లుపై శాసనసభ, మండలి అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని, ప్రభుత్వం నుండి అభిప్రాయం అక్కర్లేదన్న విషయాన్ని రాష్ట్రపతి స్పష్టంగా చెప్పారని ఆయన అన్నారు. రాష్ట్రపతికే సూచనలు అందించే స్థాయి సీఎంకు తగదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సభ్యుల అభిప్రాయాలు తెలపడానికే మరింత గడువు కావాలని లేఖలో వ్రాసిన విషయం గుర్తులేదా? అని ప్రశ్నించారు. రూల్77 అనేది రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలకు మాత్రమే వర్తిస్తుందని, సీఎం ఇచ్చిన నోటీసును స్పీకర్ పరిగణనలోకి తీసుకోవద్దని ఆయన కోరారు. సభ్యుల అభిప్రాయాలు తెలపడం తప్ప బిల్లును వెనక్కు పంపడం దేశచరిత్రలోనే ఎక్కడా లేదని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *