ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ రాష్ట్రం, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన మాలావత్ పూర్ణ, సాధనపల్లి ఆనంద్‌లను శాసనసభ అభినందిస్తూ తీర్మానం ఆమోదించింది. వీరిద్దరితో పాటుతోపాటు వారి కోచ్ బీ శేఖర్‌బాబుకు కూడా రూ.25 లక్షల చొప్పున నగదు పురస్కారాన్ని ప్రకటిస్తూ తీర్మానించింది.
పూర్ణ, ఆనంద్ కుటుంబాలకు ఐదేసీ ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించి, వ్యవసాయానికి బోర్‌వెల్ వేయడంతోపాటు ఏడాది పాటు వ్యవసాయ పెట్టుబడిని ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వారు నివాసముంటున్న ఇంటికి అదనంగా మూడు గదుల నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు.