సియాటెల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

  • September 27, 2017 11:51 am

మెరికాలోని సియాటెల్ నగరంలో ఈ సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శని, ఆదివారాల్లో ఇంటర్ లేక్ ప్రభుత్వ పాఠశాలలొ జరిగిన ఈ ఉత్సవాల్లో స్థానికంగా ఉన్న వాషింగ్టన్ తెలుగు సమితి, వాషింగ్టన్ తెలంగాణ ఆసొసియెషన్, తెలంగాణ అమెరికా తెలుగు అసొసీయెషన్ కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ నివసించే వివిద రాష్ట్రాల ప్రజలు, శ్వేత జాతియులు పాల్గొన్నారు. సుమారు 2500 మంది పాల్గొనగా నిర్వాహకులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసారు. బతుకమ్మ ఆటా, పాటాలతో పాటు కోలాట ద్రుశ్యాలు హైలైట్ గా నిలిచాయి.

ముఖ్యఅథిదులుగా వసుంధర స్లాటర్ (అమెరికన్ పొలిటికల్ లీడర్, డెమొక్రటిక్ పార్టి), తెలుగు నటి నటులు రశ్మి, లయలు వచ్చిన ప్రజలను ఉత్సాహపరుస్తు బతుకమ్మ ఆడి పాడారు. 6 అడుగుల పెద్ద బతుకమ్మ ఈ సారి ఒక ప్రతేకత అని ముఖ్య అథిదులు నిర్వహకుల్ని ప్రసంశించారు. ఇండియా నుండి వచ్చిన జానపద కళకారుడు బిక్షునాయక్, స్థానిక కళకారులు చైతన్య, శిల్పాలు వచ్చిన వారికి డప్పు దరువులతో, మంచి మంచి పాటలతో ఆహ్వనం పలికారు.

వాటా ప్రెసిడెంట్ హరి కట్కురి, వాట్స్ ప్రెసిడెంట్ రాం కొలెటి, వాట్స్ మాజి ప్రెసిడెంట్ వంశి రెడ్డి, ఇతరులు ఎప్పటికప్పుడు వాలంటీర్స్ ను సమన్వయం చేస్తు ఈ సంబరాల్ని ఘనంగా నిర్వహించినందుకు వసుందర స్లాటర్ ప్రత్యెకంగా అభినందించారని స్థానిక తెలుగు సంఘాల ప్రతినిది జలగం సుధీర్ తెలిపారు.


Connect with us

Videos

MORE