ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కలలుకన్న బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములై బంగారు తెలంగాణ సాధిద్దామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పోరాటయోధుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు.
అభివృద్ధిలో యావత్ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం నిలబెడతారని, సీఎం కేసీఆర్ కు ఉన్న విజన్, కమిట్ మెంట్ చూస్తే బంగారు తెలంగాణ సాధించడం ఖాయమని తుమ్మల అన్నారు. ప్రతీ పల్లెకు రహదారి, తాగునీరు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ లాంటి పథకాలతో ముందు తరాలకు గుర్తుండేలా కేసీఆర్ తనదైన ముద్ర వేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.