mt_logo

బాబుకు షాక్ ఇచ్చిన తెలంగాణ తమ్ముళ్ళు

టీడీపీ అధినేత చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు మరోసారి షాక్ కు గురి చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రకాష్ గౌడ్, చల్లా ధర్మారెడ్డి, గంగాధర్ గౌడ్ తదితరులు గురువారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు తెలంగాణ పట్ల చూపుతున్న వివక్ష పట్ల విసుగుచెంది టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు. ఇటీవలే ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు భారీగా టీఆర్ఎస్ లో చేరడంతో జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఆ షాక్ నుండి తేరుకోని బాబుకు గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి ఝలక్ ఇచ్చారు.

ఈనెల 18, 19 తేదీల్లో జరగనున్న పార్టీ ప్లీనరీ సమావేశాల్లో వీరు టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. వీరే కాకుండా మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే సీఎం కేసీఆర్ ను కలిసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తిరిగి చంద్రబాబును కలిసి తాను టీఆర్ఎస్ లో చేరడం లేదని సంజాయిషీ ఇచ్చుకున్నట్లు సమాచారం. ఇంకా టీడీపీ లోనే కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని, నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే పార్టీ మారాల్సిందేననే అభిప్రాయానికి టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *