mt_logo

బాబుకు పవర్ పంచ్!

-పీపీఏలు చెల్లుతాయని ప్రకటించిన ఏపీఈఆర్సీ
-రెండు నెలల విద్యుత్ వివాదానికి తెర.. 34 పేజీల తీర్పు
-ఏపీజెన్‌కో నిర్ణయం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని వ్యాఖ్య
-ఇక ఉమ్మడి విద్యుత్‌లో 53.8 శాతం తెలంగాణకు ఇవ్వాల్సిందే
తెలంగాణ విద్యుత్‌తో ఆటలాడుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబుకు సోమవారం షాక్ తగిలింది. 13 పీపీఏలపై ఏపీ జెన్‌కో లేవనెత్తిన అభ్యంతరాలను తోసివేస్తూ ఏపీఈఆర్సీ తీర్పు ప్రకటించింది. ఫలితంగా తెలంగాణ డిస్కమ్‌ల వాదనను ఏపీఈఆర్సీ సమర్థించినట్టయింది. దీనితో పీపీఏల సాకుతో తెలంగాణకు విద్యుత్‌ను అడ్డుకోవాలన్న చంద్రబాబు కుట్రలు భగ్నమయ్యాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్న విధంగా ఇకనుంచి ఉమ్మడి విద్యుత్‌నుంచి 53.8 శాతం విద్యుత్ తెలంగాణకు దక్కనుంది. విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కుదిరిన మొత్తం 31 పీపీఏల్లో తెలంగాణ వాటా ఖరారైనట్టయింది.

ఏపీ సర్కారు సహకారంతో ఏపీ జెన్‌కో లేవనెత్తిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ) వివాదానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) ముగింపు పలికింది. ఏకపక్షంగా పీపీఏలు రద్దు చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. ఒప్పందంలో ప్రతిపేజీ మీద భాగస్వామ్య పార్టీలన్నీ సంతకాలు చేసినందున అవి ముసాయిదాలుగా భావించలేమని అభిప్రాయపడింది. 34 పేజీల తీర్పులో వివిధ అంశాలను విశ్లేషిస్తూ వివరణాత్మక తీర్పు ఇచ్చింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీజెన్‌కో-నాలుగు డిస్కమ్‌లు కుదుర్చుకున్న పీపీఏలకు సమ్మతి (ఆమోదం) ఉందని ఈఆర్సీ స్పష్టం చేసింది. వాటిని పాటించి తీరాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు సోమవారం రాత్రి ఏపీఈఆర్సీ తన వెబ్‌సైట్‌లో 34 పేజీలతో కూడిన తీర్పును వెలువరించింది. ఏపీఈఆర్సీ చైర్మన్ డాక్టర్ వెంకటరమణి భాస్కర్, మెంబర్లు ఆర్ అశోకాచారి, పీ రాజగోపాల్‌రెడ్డి పేరిట ఈ తీర్పు వెలువడింది.

ఇక వివాదాలకు తెర?..
ఈఆర్సీ తీర్పుతో దాదాపు రెండు నెలలుగా ఆంధ్రా సర్కారు సృష్టించిన విద్యుత్ వివాదాలకు తెరపడినట్లయింది. తెలంగాణ డిస్కమ్‌ల వాదనలు వాస్తవమని ఈఆర్సీ నిర్ధారించినట్లయింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014, జూన్ రెండో తేదీ నుంచి అమలులోకి వచ్చినందున తెలంగాణలోని రెండు డిస్కమ్‌లతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీజెన్‌కో జూన్ 21వ తేదీన ఏపీఈఆర్సీకి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావిస్తూ వరుసగా ఏడు సంవత్సరాల పాటు (27.11.2009 నుంచి 22.1.2013) ఏపీజెన్‌కో, డిస్కమ్‌ల మధ్య విద్యుత్ వ్యాపార సంబంధాలు, బిల్లింగ్, చెల్లింపులు జరిగిన విషయాన్ని ఈఆర్సీ నిర్ధారించింది.

మొత్తం 28 పీపీఏలలో కేవలం 13 పీపీఏలను ఉపసంహరించుకోవడం అసమంజసమైన చర్యగా పేర్కొంది. పీపీఏల ఖరారుకు ఈఆర్సీ పరంగా ఎందుకు జాప్యం చోటుచేసుకుందనే అంశాలను కూడా వివరించింది. ఏపీఈఆర్సీ మొత్తంగా 31 పీపీఏలపై నిర్ణయాలు తీసుకుందని తెలిపింది. ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీజెన్‌కో ముసాయిదా ఒప్పందాలను ఉపసంహరించుకుంటున్నట్లుగా పేర్కొనడాన్ని ఈఆర్సీ తప్పుపట్టింది. పీపీఏ ఒప్పందాలలోని ప్రతి పేజీపైన ఏపీజెన్‌కో, డిస్కమ్ అధికారులు, ప్రతినిధుల సంతకాలు చేసినందున వాటిని ముసాయిదా ఒప్పందాలుగా పరిగణించరాదని స్పష్టం చేసింది.

డిస్కమ్‌లను ఏమాత్రం సంప్రదించకుండా ఏపీజెన్‌కో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమైనదని ఈఆర్సీ పేర్కొంది. ప్రస్తుతం నడుస్తున్న పవర్ ప్లాంట్లు అన్నింటికీ పీపీఏలున్నాయని తెలిపింది.

కొత్త ప్రాజెక్టులకు పీపీఏలు లేనట్టే..: కొత్తగా రాబోయే పవర్ ప్రాజెక్టులకు సంబంధించి పీపీఏలు ఇకపై మనుగడలో ఉండవని, అదేరీతిలో తెలంగాణలోని రెండు గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజెక్టుల(శంకరపల్లి, కరీంనగర్) పీపీఏలు కూడా మనుగడలో ఉండవని పేర్కొంది. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న హైడల్ పవర్ జనరేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మరింత సమాచారం కమిషన్‌కు అందజేయాలని తెలంగాణ పవర్ కో-ఆర్డినేషన్ కమిటీ(టీపీసీసీ), ఆంధ్రప్రదేశ్ పవర్ కో-ఆర్డినేషన్ కమిటీ(ఏపీపీసీసీ)లను నిర్దేశించింది. విభజన తదుపరి ఇరు రాష్ట్రాల(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) మధ్య తలెత్తిన విద్యుత్ వివాదాలపై కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయడాన్ని మంచి పరిణామంగా ఈఆర్సీ పేర్కొంది.

పంటలు కోల్పోయిన రైతుకు సర్కారు బాసట
విడుదలైన 90 రోజుల్లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రకృతి వైపరీత్యాల కింద రంగారెడ్డి జిల్లాకు 28.62 కోట్లు, మెదక్ జిల్లాకు రూ.34.33 కోట్లు, నిజామాబాద్ జిల్లాకు 1.27 కోట్లు, మహబూబ్‌నగర్ జిల్లాకు 96.11 కోట్లు, నల్లగొండ జిల్లాకు 72.85 కోట్లు, వరంగల్ జిల్లాకు 18.69 కోట్లు, ఖమ్మం జిల్లాకు 1.35 కోట్లు, కరీంనగర్ జిల్లాకు 87.09 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాకు రూ.64.26 కోట్లు విడుదల చేశారు.

2009-13లో భారీవర్షాలకు నష్టపోయిన రైతులకు..
రంగారెడ్డి జిల్లాకు 2.14 కోట్లు, మెదక్ జిల్లాకు 12.03 కోట్లు, నిజామాబాద్ జిల్లాకు 18.79 కోట్లు, మహబూబ్‌నగర్ జిల్లాకు 3.67 కోట్లు, నల్లగొండ జిల్లాకు రూ.3 కోట్లు, వరంగల్ జిల్లాకు రూ.12.33 కోట్లు, ఖమ్మం జిల్లాకు రూ.1.16 కోట్లు, కరీంనగర్ జిల్లాకు రూ.18.86 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాకు రూ.4.74 కోట్ల చొప్పున విడుదల చేశారు.

రైతుల బకాయి చెల్లింపునకు రూ.9.50 కోట్లు విడుదల
నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న పండించిన రైతులకు బకాయిల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9.50 కోట్లను సోమవారం విడుదల చేసింది. ఎర్రజొన్న రైతులు తమ దిగుబడులను ఎగువ రాష్ట్రాలకు అమ్మినా అక్కడి నుంచి డబ్బులు చేతికందలేదు. మధ్యదళారులు, బ్రోకర్ సంస్థలు స్వాహా చేశాయి. వేలాది మంది రైతులు దీని వల్ల ఆర్ధికంగా నష్టపోయారు.

న్యాయం చేయాలని రైతాంగం పోరాటం చేసినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఆర్మూర్ ప్రాంతాల్లో రోజుల తరబడి నిరహార దీక్షలు చేశారు. న్యాయమడిగిన రైతులపై అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసింది. కానీ వారికి రావాల్సిన సొమ్మును మాత్రం ఇప్పించలేకపోయింది. ఒకానొక సందర్భంలో పోలీసు కాల్పులు కూడా జరిగాయి. టీఆర్‌ఎస్ పార్టీ రైతాంగ ఉద్యమానికి బాసటగా నిలిచింది. అప్పట్లో నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఉద్యమంలో నేటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాల్గొని రైతుల న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించాలన్నారు. వారిని ఆదుకోవాలని అప్పటి ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ రైతులకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకునే క్రమంలోనే ఒక్క రోజే రూ.9.50 కోట్లు నిజామాబాద్ జిల్లా కోసమే విడుదల చేయడం గమనార్హం.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *