కలిసుందామంటూనే కలబడడం సీమంధ్రులకు కొత్తేమీ కాదు.ఇది సమైక్యవాదులకే చెల్లింది. గత నెలలో నిండు గర్భిణిని చికిత్స చెయ్యకుండా వెళ్ళగొట్టిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మళ్ళీ తెలంగాణకు చెందిన విద్యుత్ అధికారిపై ఆ శాఖకే చెందిన రాయలసీమ సిబ్బంది సమైక్య ముసుగులో దాడి చేసారు.
మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల మండలం షేక్ పల్లికి చెందిన సర్వేశ్వర్ రెడ్డి గతంలో కర్నూల్ జిల్లా ఓర్వకల్లు మండలంలో తాత్కాలిక లైన్మన్ గా పని చేసారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కోదండాపురం పరిధిలోని సబ్ స్టేషన్లో పని చేస్తున్నారు. మంగళవారం విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ షాక్ కు గురవ్వడంతో కర్నూల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
సమాచారం అందుకున్న డీఈ శ్రీనివాసులు ఆస్పత్రికి వెళ్ళి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. న్యాయం చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేసారు. అక్కడే వున్న స్థానిక విద్యుత్ సిబ్బంది 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. రెగ్యులర్ ఉద్యోగికి వచ్చే శాఖాపరమైన బెనిఫిట్స్ అందేలా చూస్తానని చెప్పినా వినిపించుకోకుండా అక్కడే వున్న సమైక్యవాదులు మృతుడి బంధువులను రెచ్చగొడుతూ ఆయనపై దాడికి దిగారు. తెలంగాణ వాడివంటూ దూషించారు. ఈ లోపు పోలీసులు రావడంతో ఉద్యోగులు,బంధువులు వెనక్కి తగ్గారు. తక్షణ సాయంగా 2 లక్షలు ఇస్తామని హామీ ఇవ్వడంతో డీఈని వదిలిపెట్టారు. డీఈ పై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని కర్నూల్ ఎస్పీ కి ఫిర్యాదు చేయనున్నట్లు పాలమూరు ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు పాలమూరు ఎస్ఈ సదాశివరెడ్డి తెలిపారు.