రవీంద్ర భారతి ఓపెన్ ఆడిటోరియం లో జరిగిన ఒక కార్యక్రమం లో తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ నిర్మాణంలో వస్తున్న డాకుమెంటరీ చిత్రం ” ఆర్ట్ ఎట్ హార్ట్ (Art at Heart) పోస్టర్ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు , నిర్మాత శ్రీ సానా యాది రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారు, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ డాకుమెంటరీ డైరెక్టర్ యెన్నెన్జీ మరియు ఇతర సాంకేతిక నిఫుణులను అభినందించి అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చే విధంగా తీర్చిదిద్దాలని కోరారు.
“ఆర్ట్ ఎట్ హార్ట్” అనే డాక్యుమెంటరీ కోయల లయాత్మక ఆట కొమ్ము నృత్యం మరియు పాటపై ఫోకస్ చేస్తూ వస్తున్న చిత్రం. ఇంకో పదిహేను రోజుల్లో విడుదల కానుంది.