తెలంగాణ మిత్రులందరికీ విన్నపం!

  • November 30, 2018 12:36 pm

By విజయకృష్ణ చాట్ల

తెలంగాణకు ఆంధ్రాపార్టీలు, వాళ్ళను చంకన ఎక్కించుకునేటోళ్లు వద్దే వద్దు! పొలిమేరల వరకు తరమండి! వాళ్లకు ఓటు వెయ్యనే వద్దు!
మన అరవై ఐదేండ్ల సమస్య అయిపోయిందనుకునేలోపే గోతికాడ నక్క లెక్క కూచున్న తికమక మాటల బాబు ఇక్కడ చక్రం తిప్పుడు ఎవడి మంచి కోసం? తెలంగాణ నీళ్ల దొంగకు మల్ల ఇక్కడేం పని?

వ్యక్తిగత ఆరోపణల్లో నిజం లేదని ఒక వ్యక్తిని నెత్తిన పెట్టుకోవాలని చెప్పడం లేదు! కానీ, తెలంగాణ చరిత్రలో ఈ ఎన్నికలు ఒక ముఖ్యమైన మలుపు! అవకాశం కోసం కాచుకొని కూచున్న చంద్రబాబు తన బద్ద శత్రువైన కాంగ్రెస్ తోటి దోస్తీ ఎందుకు చేస్తుండో చూడండి! తెలంగాణ ప్రభుత్వం మీద ఏ మాత్రం ప్రభావం చూపగలిగే శక్తి ఉన్నా ఈ తోడేలు బాబు తినేస్తడు! రోజువారీ నీళ్ల చోరీ చేసుకుంటనే మల్ల తెలంగాణల ఓట్లడుగుతరట! అసలే నిలబెట్టి చెడ్డీలు ఊడబీక్కొని పోయిండ్రు అరవై ఏండ్లు! ఇగ జెరంత సందిస్తే ఇల్లంతా మాదే అనేటోళ్లు ఇగ ఏం చేస్తారో ఆలోచించండి! తెలంగాణ అసెంబ్లీల టీడీపీ వాళ్ళు ఉండనే వద్దు! వాళ్ళకు ఒక్క సీటు వచ్చినా తెలంగాణ అమరవీరులకు సిగ్గు చేటు!

నచ్చని లక్షణాలు కొన్ని ఉన్నా సరే, తెలంగాణకు మేలు చేయగలిగిన నాయకుడు ఇప్పట్లో మనకు లేడు! అందుకే దయచేసి ఆలోచించండి. తెలంగాణకు పనికి వచ్చే తెరాస పార్టీనే గెలిపించడం ఇప్పుడు మనమందరం చేయవలసిన పని!

మోస పోవద్దు!


Connect with us

Videos

MORE