టంగుటూరి అంజయ్య 28 వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు లుంబినీ పార్క్ వద్దనున్న అంజయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, అంజయ్య సేవలు గుర్తుండేలా కార్యక్రమాలు చేపడతామని, ఆయన విగ్రహాన్ని ముషీరాబాద్ లో నెలకొల్పుతామని చెప్పారు.
అంతేకాకుండా హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఉద్యానవనానికి టంగుటూరి అంజయ్య పేరు పెడతామని సీఎం హామీ ఇచ్చారు. కార్మికుడి స్థాయినుండి యూనియన్ లీడర్ గా, కార్మిక శాఖామంత్రిగా, ఏపీ ముఖ్యమంత్రిగా అంజయ్య ఎదిగారని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంజయ్య చేసిన సేవలు మరపురానివని కేసీఆర్ పేర్కొన్నారు.