కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలనుద్దేశించి చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, పక్క రాష్ట్రాల వారిని, గడ్డపోల్లను మనం పట్టించుకోవద్దని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈ మధ్య పార్టీ పెట్టాడని, ఆడియో ఫంక్షన్లో మాట్లాడినట్లు రెండు గంటలు మాట్లాడిపోతూ కాంగ్రెస్ హటావో, దేశ్ కో బచావో అనే నినాదం ఇచ్చాడని చెప్తూ కాంగ్రెస్ హటావో అన్నది నచ్చిందని కేటీఆర్ అన్నారు. దానిని మనం కూడా ఆచరించాలని, ఆంధ్రా పార్టీ హటావో, తెలంగాణ బచావో అనాలని, ఆంధ్రా పార్టీలేవైనా ఉంటే వాటిని తరిమేయాలని తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు మంగళవారం తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. వచ్చే స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని, టీఆర్ఎస్ తెలంగాణలో నెంబర్ వన్ గా ఎదుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా ఇన్నేళ్ళూ మోసం చేసిందని, ఇంతమంది అమరుల బలిదానాలు చూసైనా కరగలేదని, ఉద్యమాలు జరిగినప్పుడు కేసులు పెట్టింది వారేనని, ఇప్పుడు తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది మేమే అని అంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. 2004లో ఒకసారి, 2009 లో ఒకసారి తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చి అది నెరవేర్చకుండా వేలమంది బలిదానాలకు కాంగ్రెస్ పార్టీ కారణం అయ్యిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు మరో రెండు నెలల్లో ఉండగా చివరి పార్లమెంటు సమావేశాల్లో మాత్రమే బిల్లు పెట్టారు. తెలంగాణ ప్రజలు ఇదంతా మర్చిపోలేదని, తెలంగాణ ఎవరివల్ల వచ్చిందో వారికి స్పష్టంగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కేఎస్ రత్నం, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Congress government mulling over cutting down Rythu Bharosa beneficiaries
- Anganwadis suffering due to Congress government’s gross negligence
- Corruption became rampant in Telangana under Congress rule: Survey
- 1 cr acres of agricultural land at risk of losing Rythu Bharosa?
- CWC rejects DPRs of 3 irrigation projects due to Congress government’s apathy
- బీసీ కులగణనపై బీజేపీ వైఖరి చెప్పాలి: కవిత
- ఆరు గ్యారెంటీలను అటకెక్కించి.. ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు: కేటీఆర్
- తెలంగాణలో నడుస్తున్నది ఇందిరమ్మ రాజ్యమా లేక పోలీస్ రాజ్యమా?: హరీష్ రావు
- బీసీలకు 42% రిజర్వేషన్లను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోము: కవిత
- భారతీయ సినిమాకు వన్నె తెచ్చిన శ్యామ్ బెనెగల్ తెలంగాణకు గర్వకారణం: కేసీఆర్
- భూభారతి చట్టం భూహారతి అయ్యేటట్లు కనిపిస్తుంది: కవిత
- రైతుభరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 26,775 కోట్లు బాకీ పడ్డది: కేటీఆర్
- ఫార్ములా-ఈ కేస్ ఎఫ్ఐఆర్లో కావాల్సినంత సరుకు లేదు.. కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
- హైకోర్టు ఉత్తర్వులతో ఫార్ములా-ఈ కేస్ డొల్లతనం తేటతెల్లమైంది: హరీష్ రావు
- ఫార్ములా-ఈ కేసులో అణాపైసా అవినీతి లేదు.. న్యాయపరంగా ఎదుర్కొంటాం: కేటీఆర్