mt_logo

తెలంగాణలో అక్రమంగా పాతుకుపోయిన సీమాంధ్ర ఉద్యోగులపై కొరడా!

రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ ద్వారా తెలంగాణలోని పది జిల్లాలలో అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు ఎంతమంది? డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నవారెంతమంది? లాంటి వివరాలు పొందుపర్చనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఉద్యోగుల పంపకానికి మార్గం సులభమవుతుందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి పుట్టిన ఊరు, టెన్త్ క్లాస్ వరకు ఎక్కడ చదివింది, గ్రాడ్యుయేషన్ ఏ జిల్లాలో పూర్తిచేసారు, ఉద్యోగం పొందిన విధానం, మొదటి పోస్టింగ్ ఎక్కడ, బదిలీలు, పదోన్నతులు, డిప్యుటేషన్ మీద ఎక్కడెక్కడ పనిచేసారు, ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు తదితర అంశాలను ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్లో పొందుపర్చనున్నారు. ఈ విధమైన చర్య ద్వారా ప్రతి ఉద్యోగి వివరాలు ప్రాంతాలు, జిల్లాల వారీగా అందుబాటులో ఉంటాయి. ఎన్నో ఏళ్ళుగా వేలాది మంది సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ జిల్లాల్లో అక్రమంగా తిష్ట వేసారని తెలంగాణ ఉద్యోగసంఘాలు ఎంత ఆందోళన చేసినా, ఉన్నతాధికారులు సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు కావడంతో పట్టించుకోలేదు. ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ ద్వారా అక్రమార్కుల భరతం పట్టొచ్చని పలువురు తెలంగాణ ఉద్యోగుల అభిప్రాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *