mt_logo

అది మీడియా స్వేచ్ఛను కాలరాయడమే

-చంద్రబాబు ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు కొందరు విలేకరులను అడ్డుకోవడంపై జస్టిస్ కట్జూ
-ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు నమస్తే తెలంగాణ, సాక్షి పత్రికలు, టీవీ చానళ్లకు చెందిన పాత్రికేయ ప్రతినిధులను అనుమతించకపోవడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలకు పత్రికలు, చానళ్ల ప్రతినిధులను నిరోధించడం భారత రాజ్యాంగంలోని 14, 19(1) (ఏ) అధికరణలను ధిక్కరించడమేనని అన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సీనియర్ పాత్రికేయులు రాజీవ్ రంజన్ నాగ్ కన్వీనర్‌గా వ్యవహరించే విచారణ కమిటీలో కే అమర్‌నాథ్, ప్రజ్ఞానంద్ చౌదరి సభ్యులుగా ఉంటారు. కమిటీ సభ్యులు ఈ నెల30వ తేదీన హోంశాఖ, సమాచార శాఖ కార్యదర్శులతో సమావేశం కానుంది. అక్టోబర్ 1వ తేదీన పాత్రికేయుల అభిప్రాయాలు తీసుకుంటుంది. అనంతరం పూర్తిస్థాయి నివేదికను పీసీఐ చైర్మన్ కట్జూకు కమిటీ అందజేయనున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *