తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆర్ధికమంత్రి హోదాలో బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా బడ్జెట్ ను ప్రశంసించారు. సీఎం ప్రవేశపెట్టిన బడ్జెట్ సమతూకంగా ఉందన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగాలకు కేటాయింపులు సరిగ్గా ఉన్నాయన్నారు.
మేనిఫెస్టోలో చేసిన వాగ్ధానాలను నెరవేర్చే విధంగా కేటాయింపులు ఉన్నాయని పేర్కొన్నారు. పెన్షన్లు, రైతుబంధు, రుణమాఫీ పథకాల కోసం పూర్తి స్థాయిలో కేటాయింపులు ఉన్నాయన్నారు. సమతూకమైన బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.