mt_logo

కొత్తగా ఏర్పడే పరిశ్రమలలో 46,230 ఉద్యోగాలు!

పరిశ్రమల శాఖ అధికారులతో ఈరోజు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశమై పలు అంశాలపై సమీక్ష జరిపారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాల్లో 5,280 యూనిట్లలో 5,289 కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని, కొత్తగా ఏర్పాటు కాబోయే పరిశ్రమలలో 46,230 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా 3,067 మైక్రో, 149 స్మాల్ పరిశ్రమల కోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. అంతేకాకుండా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 15 రోజుల్లో, భారీ పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులు వస్తాయని జూపల్లి చెప్పారు.

ఆన్ లైన్ లోదరఖాస్తు చేసుకుంటే పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని, పరిశ్రమల అనుమతుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైనా తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మూతపడిన పరిశ్రమల గురించి ప్రభుత్వం డేటా సేకరిస్తుందని, ఆ పరిశ్రమలను తెరిపించేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుందని మంత్రి చెప్పారు. పరిశ్రమల అనుమతుల్లో జాప్యంపై టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని, సబ్సిడీల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జూపల్లి కృష్ణారావు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *