mt_logo

టీఆర్ఎస్ ప్లీనరీలో 12 తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయం

తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ తొలి ప్లీనరీ సమావేశాల్లో ప్రవేశపెట్టే తీర్మానాలపై తుది నిర్ణయం తీసుకున్నారు. తీర్మానాల కమిటీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమై 12 తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సంక్షేమ, అభివృద్ధి రంగాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ముఖ్యంగా ఆసరా, మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, హాస్టళ్ళలో సన్నబియ్యం పథకం తదితర అంశాలను ప్లీనరీలో ప్రవేశపెట్టనున్నారు. మంగళవారం కల్లా తీర్మానాల ముసాయిదా సిద్ధం చేయాలని, ప్లీనరీకి వచ్చే 36 వేల మంది ప్రతినిధులకు వీటి ప్రతులు ఇవ్వాల్సి ఉన్నందున వాటి ముద్రణను మంగళవారం కల్లా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కమిటీకి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *