mt_logo

మహాకూటమికి ప్రజామోదం లేదా..???

మహాకూటమి.. టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా పోటీ అంటూ నానా హడావిడి చేస్తున్న నాలుగు పార్టీల కూటమి.. అయితే, ఈ కూటమికి ప్రజామోదం ఉందా..?? లేదా…? అనేది ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాలలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఏ రాజకీయ వ్యవస్థ అయినా ప్రజామోదం పొందాలంటే ముందుగా అది ప్రజల ఆశీర్వాదం పొందాలి. కానీ, గత నెల రోజులుగా నాలుగు సీట్ల కోసం ఎడతెగని పంచాయితీలు పెడుతున్న టీడీపీ, కాంగ్రెస్‌, టీజేఎస్‌, సీపీఐ పార్టీలకు జనామోదం లేదనే చర్చ నడుస్తోంది. ముందుగా ఆ బాధ్యత తీసుకొని ఆశీర్వదించాలని ప్రజల ముందుకు వెళ్లాల్సిన కాంగ్రెస్‌.. తమ అధిష్టానం చుట్టూ తిరగడానికే టైమ్‌ సరిపోక సతమతం అవుతోంది. ఇక, ముందుగా నాలుగు పార్టీలు కలిసి ఒక్క బహిరంగ సభ అయినా జరపాలని ఒత్తిడి తేవాల్సింది పోయి, ముందు తమ సీట్ల సంఖ్యను తేల్చాలని పట్టు పడుతున్నాయి. ముందుగా పొత్తు ఉంటుందో లేదో అనే అంశమే ఇప్పటివరకు ఫైనలైజ్‌ కాలేదు.. ఇది కూడా మహాకూటమికి నెగిటివ్‌గా మారుతోంది.

ఎన్నికల ప్రచారం ముగియడానికి సరిగ్గా ౩౦ రోజుల సమయం ఉంది. మరోవైపు, ఈ నాలుగు పార్టీలు తమ పొత్తులను, అభ్యర్ధులను ప్రకటించడానికి మరికొంత సమయం తీసుకుంటున్నాయి.. ఇలాంటి టైమ్‌లో ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధం కావాల్సిన సమయాన్ని ఇలా దుర్వినియోగం చేసుకుంటూ ప్రజలకి నెగిటివ్‌ సంకేతాలను ఎందుకు పంపుతుందనేది పజిల్‌గా మారుతోంది..

నిన్నమొన్నటిదాకా టీడీపీ-కాంగ్రెస్‌ బద్ధ శత్రువులు.. ప్రస్తుతం మిత్రులు.. ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయనేదే విచిత్రం.. ఇక, కలిసి పోటీ చేస్తున్నాయనడం వినడానికే ఆశ్చర్యంగా ఉంది.. ఇక, గతంలో టీడీపీని టీజేఎస్‌ అధినేత కోదండరామ్‌ ఏ రేంజ్‌లో ఆడుకున్నారో తెలియని విషయం కాదు.. ఇటు, సీపీఐ నేతలు ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి పోరాడతారు.. అదే తెలంగాణలో సైకిల్‌ ఎక్కి పోరుబాట పడతాడరు టీఆర్‌ఎస్‌ని గద్దె దించాలంటూ.. ఇలాంటి పార్టీలకు ప్రజల మద్దతు, వారి ఆమోదం ఉంటుందని ఎవరయినా ఊహిస్తారా.?. అదే ఆ నాలుగు పార్టీలను నిండా ముంచనుంది.. ఈ విషయం మరో 35 రోజుల్లోనే తేలిపోనుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *