mt_logo

ఖమ్మంలో పదికి పది… కేసీఆర్‌ ధీమా ఏంటి..??

ఉద్యమాల ఖిల్లా…. ఖమ్మం జిల్లా.. తెలంగాణ రాజకీయ గుమ్మం.. ఖమ్మం… అలాంటి ఖమ్మం జిల్లా ఈ ఎన్నికలలో ఎవరికి అండగా నిలవబోతోంది.. ఎవరికి పట్టం కట్టబోతోంది. గత ఎన్నికలలో సీమాంధ్ర పార్టీలయిన వైసీపీ, టీడీపీ ఉనికి చాటాయి.. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనుసరించిన పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలతో గులాబీమయంగా మారిపోయింది ఖమ్మం జిల్లా. అందుకే, ఖమ్మం నుండే తొలి మలిదశ ప్రచారానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్‌.. ఈసారి ఖమ్మంలో స్వీప్‌ చేస్తామని చెబుతున్నారు.. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ గులాబీ జెండా రెపరెపలు కనిపిస్తాయని ఆయన ధీమాగా చెబుతున్నారు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలున్నాయి. నిన్నమొన్నటిదాకా ఈ జిల్లాపై సీమాంధ్ర పార్టీలయిన టీడీపీ, వైసీపీ ప్రభావం ఎక్కువగా కనిపించింది. కేపీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ జిల్లా నుండే కాదు.. ఏకంగా తెలంగాణ నుండే అంతరించి పోయింది. ఆ పార్టీ ఇక్కడ తుడిచి పెట్టుకుపోయింది. ఇక మరో సీమాంధ్ర పార్టీ అయిన టీడీపీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది ఖమ్మం జిల్లాలో. నాడు ఆ పార్టీకి కంచుకోట అయిన జిల్లాలో నేడు ఉనికి కోసం పోరాడుతోంది.

ఈ పరిణామాలను రాజకీయ వ్యూహ చతురుడు అయిన కేసీఆర్‌ పక్కాగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో తన స్నేహితుడు తుమ్మల నాగేశ్వరరావుకి ఉన్న ప్రాబల్యం గుర్తించి ఆయనకు పెద్ద పీట వేశారు. నాడు సైకిల్‌ దిగి కారెక్కిన తుమ్మల రాకతో ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ ప్రతి గ్రామానికీ విస్తరించింది.. పల్లెపల్లెనా పట్టును పెంచుకుంది. వీటికి తోడు వైసీపీ అంతర్ధానం తమకు కలిసి వస్తుందనేది కేసీఆర్‌ ధీమా. జిల్లాలో ప్రారంభించ బడిన సీతారామ ఎత్తిపోతల పథకంతో ఖమ్మం దశ దిశ మారిపోతుంది. అటవీ జిల్లాగా పేరుబడిన జిల్లాను పచ్చదనంతో, పసిడి పంటలతో అలరారే జిల్లాగా మార్చడానికి కేసీఆర్‌ రచించిన ప్రణాళికలు జిల్లాలో జీవం పోస్తున్నాయి..

వీటికితోడు కూటమిలోని గ్రూపు తగాదాలు, రెబల్స్‌ కాంగ్రెస్‌ని అల్లకల్లోలం చేస్తోంది.. ఇన్ని పరిణామాల నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో పదికి పది కొడతామని ధీమాగా చెప్పాడు కేసీఆర్‌.. ఇక ఎన్నిక జరగడమే ఆలస్యం.. జిల్లా గులాబీమయం అవడం ఖాయం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *