mt_logo

కరీంనగర్ బంద్ ప్రశాంతం

మంత్రి డీ.శ్రీధర్‌బాబును శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పదవి నుండి తప్పించి సీమాంధ్రకు చెందిన మరో మంత్రి శైలజానాథ్‌కు అప్పగించడంపై యావత్ తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్‌కు చెందిన టీ కాంగ్రెస్ సభ్యులు బంద్‌కు పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా కరీంనగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోగా, పలు వ్యాపార సంస్థలు మూతబడ్డాయి.
మంత్రి శ్రీధర్‌బాబు వాణిజ్య శాఖను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని, సభ విధానాలకు అణుగుణంగానే తాను నడుచుకున్నట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *