కాంగ్రెస్, టీడీపీ బద్ధ శత్రువులు.. సుమారు 36 సంవత్సరాలుగా ఆ రెండు పార్టీలు ఇటు తెలుగు రాష్ట్రాలలోనూ, అటు జాతీయ స్థాయిలోనూ పోటీ పడ్డాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు ఆ రెండు పార్టీల అభ్యర్ధులు.. కాంగ్రెస్, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అలాంటి రెండు పార్టీలు తూచ్…. తమ మధ్య కొత్త బంధం చిగురించిందని, ఇకపై తాము ఇద్దరం ఫ్రెండ్స్ అని, జాతీయ అవసరాల కోసం, ప్రజాస్వామ పునరుద్ధరణ కోసం తమ కలయిక తప్పదని తేల్చిచెప్పడంతో ఆ రెండు పార్టీల నేతలే షాక్ అయ్యారు.
ఆ రెండు పార్టీల నేతలలోనే ఈ పొత్తుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అలాంటిది కేడర్‌లో దీని సంకేతాలు ఎలా ఉంటాయి…? పొత్తు వికటించడం గ్యారంటీ అని సీనియర్ రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఇది నిలిఏ పొత్తు కాదని, వికటించేదే అని, ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య కష్టమని చెప్పడంతో షాక్ అయ్యాయి కేడర్.
అయితే తమ పొత్తు అంశం వికటించకూడదంటే, ఆ రెండు పార్టీలతోపాటు మరో పార్టీ కావాఆలి. తెలంగాణ సమాజంలో విస్తృత ఆమోదం ఉన్న నేత కావాలి. ఈ రెండు పార్టీల పొత్తును ముందుకు లీడ్ చేసే నేత కావాలి.. అందుకే, టీజేఎస్ అధినేత కోదండను బరిలోకి దింపారట టీడీపీ, కాంగ్రెస్ నేతలు.. ఆయన కూటమికి ఫేస్‌గా ఉంటారని భావించారు. కానీ, అభ్యర్ధుల ఎంపికలో ఆయన 12 స్థానాలు కావాలని కోరడం, పలు అంశాలపై పీట ముడి వేయడంతో కాంగ్రెస్ తల పట్టుకుంది. చివరికి ఎలాగోలా దానిని పక్కనపెట్టింది.. తాజాగా ఆ పార్టీకి కేటాయించిన ఎనిమిదింటిలో మూడుస్థానాలలో ఫ్రెండ్లీ పోటీ అని కాంగ్రెస్ నేతలు బరిలోకి దిగుతుండం షాక్ ఇచ్చింది..
అంటే కోదండ రామ్‌ని కేవలం కూటమి కటౌట్‌గా నిలపడానికే ఈ తతంగం అంతా నిర్వహిస్తున్నారని తేలిపోయిందని చెబుతున్నారు పరిశీలకులు.. రాబోయే పదిహేను రోజుల్లో కూటమి అంతా టీజేఎస్ అధినేత కనుసన్నల్లోనే నడవనుందనే బిల్డప్ ఇస్తారు.. మీటింగ్‌లకి, బహిరంగ సభలకి ఆయనే అధ్యక్షత వహిస్తారు. కూటమి కన్వీనర్ అనే పదవి ఇచ్చి ఆయనను పక్కాగా వాడేస్తోంది కాంగ్రెస్. ఇలా, కూటమికి కటౌట్‌గా పనికివస్తున్నాడు కోదండ రామ్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి..