ఫిబ్రవరి 17న టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా చారిటీ డ్రైవ్..

  • February 8, 2019 2:00 pm

ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా శాఖ చారిటీ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. సౌతాఫ్రికాలోని మూడు ప్రావిన్స్ లలో చారిటీ డ్రైవ్ నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 17న జోహన్నెస్ బర్గ్ లోని లీమో గెట్ స్వే సేఫ్టీ హోంలో, కేప్ టౌన్ లోని 16 ఎడ్వర్డ్ రోడ్ ఒట్టేరి ప్రాంతంలో, డర్బన్ లోని రిజర్వాయర్ హిల్స్ ప్రాంతంలో అనాథ పాఠశాలలకు వెళ్లనున్నట్లు తెలిపారు. విద్యార్ధులకు అవసరమైన రోజువారీ ఉపకరణాలు, ఆహారం, పండ్లు అందించనున్నట్లు నాగరాజు గుర్రాల పేర్కొన్నారు.


Connect with us

Videos

MORE