mt_logo

నాటి విషాదాలు, నేటి వికాసాలు

గ్రామాల్లో స్వేచ్ఛ కోసం, భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన యువతను పట్టపగలే కాల్చిచంపడం, ప్రశ్నించే వారిని నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. పట్టణాల్లో ఎప్పుడు కర్ఫ్యూ ప్రకటిస్తారో, ఎప్పుడు ఎత్తి వేస్తారో, సురక్షితంగా ఎలా ఇంటికి చేరుతామోనన్న భయం ఉండేది. మతకల్లోలాల మధ్య జీవనం కొనసాగించడం, పాలు, పండ్లు, మందులు దొరుకక ఇబ్బంది పడిన రోజులున్నాయి. బడికి వెళ్లలేక, చదువు కొనసాగించలేక పిల్లలు ఇంటికే పరిమితమయ్యేవారు. పని దొరుకక ఆకలితో కార్మికులు అలమటించిన రోజులు గుర్తుకువస్తున్నాయి.

1969 నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు గత పాలకుల పనితీరు, రాజకీయ క్రీడలు గుర్తుకువస్తున్నాయి. పెత్తందారుల రాక్షసత్వం, ప్రజల జీవన పోరాటాలు యాదికి వస్తున్నాయి. వెట్టిచాకిరి కోసం గ్రామాల్లోని ప్రజల పరుగులు, పసిపిల్లల ఆకలి ఆర్తనాదాలు కండ్లముందు కదలాడుతున్నాయి. ప్రభుత్వ చౌకధరల షాపుల ముందు చెక్కర, గోధుమలు, పామాయిల్ నూనె కోసం చిన్నా, పెద్ద, కుటుంబం మొత్తం క్యూలో నిల్చున్న ఉదంతాలున్నాయి. నాటి పంచాయతీ సమితిల వల్ల రైతులు ఎరువులు, విత్తనాల కోసం మండుటెండలో కార్యాలయాల ముందు చెప్పులను లైన్లో పెట్టి అన్నదాతలు పడిన అష్టకష్టాలు గుర్తుకువస్తున్నాయి. రైతులు అప్పు కోసం సోసైటీల చుట్టూ ప్రదక్షిణలు చేసి, అప్పు దొరుకక, వ్యవసాయం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న రోజులున్నాయి. నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్ కార్డు తీసుకోవడం కోసం పొద్దుగాలనే కార్యాలయం ముందు క్యూలో నిల్చునేవారు. ఏండ్ల తరబడి చిన్న ఉద్యోగం కోసం నిరీక్షించిన రోజులున్నాయి. ఉద్యోగం రాక బతుకుదెరువు కోసం దుబాయ్, మస్కట్ లాంటి సుదూర దేశాలకు వలసవెళ్లా రు. ఉపాధి కోసం విద్యావంతులు తల్లడిల్లారు. నేతన్నలు భీమండి, బొంబాయ్, షోలాపూర్‌కు వలసపోయారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పాలమూరు బిడ్డలు తల్లిదండ్రులను గ్రామాల్లో వదిలి, పిల్లలను బడి మాన్పించి పని కోసం పట్టణాలకు వెళ్లారు. వాళ్లు ఆకలి బాధలను దిగమింగడం గుర్తుకువస్తున్నాయి. గ్రామాల్లో స్వేచ్ఛ కోసం, భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన యువతను పట్టపగలే కాల్చిచంపడం, ప్రశ్నించే వారిని నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. పట్టణాల్లో ఎప్పుడు కర్ఫ్యూ ప్రకటిస్తారో, ఎప్పుడు ఎత్తి వేస్తారో, సురక్షితంగా ఎలా ఇంటికి చేరుతామోనన్న భయం ఉండేది. మతకల్లోలాల మధ్య జీవనం కొనసాగించడం, పాలు, పండ్లు, మందులు దొరుకక ఇబ్బంది పడిన రోజులున్నాయి.

రాష్ట్రంలోని ఓటర్లు జాతీయ పార్టీల పేరుతో కూటములుగా ఏర్పడి ఎన్నికల్లో పోటీపడుతున్న వారి తీరును నిరసించాలి. ప్రగతిని కాంక్షించే పార్టీలను సమర్థించాలి. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు, పక్క రాష్ట్ర నాయకత్వాల కింద పనిచేసే పార్టీలు మనకు అవసరం లేదు. అందుకే ఎన్నికల రోజు సెలవుగా భావించవద్దు. ఓటు హక్కు ఉన్న అందరినీ పోలింగ్‌లో పాల్గొనేలా చేయాలి. మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే వారికి తగిన బుద్ధి చెప్పాలి. పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను పరుల పాలు కానివ్వవద్దు. అన్నివర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్న తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెడుతున్న పార్టీని ఆదరించాలి.

బడికి వెళ్లలేక, చదువు కొనసాగించలేక పిల్లలు ఇంటికే పరిమితమయ్యేవారు. పని దొరుకక ఆకలితో కార్మికులు అలమటించిన రోజులు గుర్తుకువస్తున్నాయి. తెలంగాణలో నిజాం కాలం నాటి ఉన్నత విద్యాలయాలో తప్ప రాష్ట్ర ఆవిర్భావం నాటికి నగరం చుట్టూ విద్యార్థులకు సరిపడే ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు లేవు. ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాలు లేక రోగులు అనేక అవస్తలు పడి, ప్రాణాలు కోల్పోయిన దుస్థితి ఉండేది. గ్రామాల్లో చెరువులు, కుంటలు కబ్జాలకు గురయ్యాయి. గుక్కెడు మంచినీళ్లు లేక సతమతమైన రోజులు గుర్తుకువస్తున్నాయి. మంచినీళ్ల కోసం కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. తెచ్చిన నీళ్లు వడ పోసుకొని తాగిన గ్రామీ ణ ప్రజల కష్టాలు గుర్తుకువస్తున్నాయి. కరెంటు బావుల దగ్గర పడుకొని, ఎప్పుడు కరెంటు వస్తుందా అని ఎదురు చూసిన రోజులున్నాయి. సమ యానికి కరెంటు రాక పంటలు ఎండిపోయిన ఉదంతాలున్నాయి. ఉన్న త చదువులు చదివినా ఉద్యోగాలు లేక నాడు నిరుద్యోగులు బాధలు పడినారు. తెలంగాణ విముక్తి కోసం నిజాం పాలనలో రజాకార్లతో పోరాడా ము. తర్వాత ప్రశాంత వాతావరణంలో ప్రగతి బాటలో పయనించి ప్రపంచంలోనే ముందుటామని కలలుగనే సమయంలో తెలుగు ప్రజల పేరుతో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. ఆ తర్వాత తెలంగాణ ప్రజల బతుకులను చిన్నాభిన్నం చేశారు. సొంత ప్రాంతంలోనే ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకాల్సి వచ్చింది. మన భాషను, యాసను వక్రీకరించారు. మన కళల్ని కించపరిచారు. తెలంగాణ నాయకులైన పీవీ, చెన్నారెడ్డిల పాలనలో సహకరించక వెన్నుపోటు రాజకీయాలతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తెలంగాణ వనరులను ధ్వంసంచేసిన నాటి పాలకుల ఆధిపత్య పాలనా తీరు తెలంగాణను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో వివక్ష, అణిచివేతల నుంచి, ఆత్మగౌరవం కోసం చేసి న ఉద్యమాలు, త్యాగాల ఫలితంగా దశాబ్దాల తెలంగాణ కల సాకారమైంది.

కేసీఆర్ నాయకత్వంలో నాలుగున్నరేండ్లుగా రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకువెళ్తున్నది. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనైతిక పొత్తులతో కూటములుగా ఏర్పడి తిరిగి రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ ప్రగతిని కాం క్షించే పార్టీలతో కాకుండా జాతీయపార్టీల పేరుతో అధికారం కోసం పోటీ పడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ నాలుగున్నరేండ్ల ప్రగతిని, ముఖ్యమంత్రి పనితీరును మనం గమనించాలి. తాగు, సాగునీరు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతున్నది. వలస పాలనలో వట్టిపోయిన చెరువులను మిషన్‌కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరిస్తున్నారు. ప్రజలకు మంచినీళ్లు అందించడానికి మిషన్ భగీరథ చేపట్టారు. పాలనా వికేంద్రీకరణ కోసం కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటు చేశారు. నాలుగువేలకు పైగా కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. స్థానిక యువతకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చారు. రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడిని అందిస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబీమా సౌకర్యం కల్పించింది. మత్య్స, గొల్ల కురుమలకు 75 శాతం సబ్సీడీతో చేపల పెంపకం, గొర్రెల పంపిణీ చేపట్టింది. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడానికి వందలాది గురకుల పాఠశాలలను ప్రారంభించింది. హాస్టళ్లలో సన్న బియ్యంతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. డిగ్రీ స్థాయి కళాశాలల ఏర్పాటు, సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రత్యేక శిక్షణను అందిస్తున్నది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల నియామాకాల ప్రక్రియను కూడా వేగవంతం చేసింది.

దీనికితోడు ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, హోంగార్డుల వంటి చిరు ఉద్యోగుల గౌరవ వేతనాలు గణనీయంగా పెంచింది. కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలు కూడా పెంచింది. విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కూడా పెంచడం ప్రశంసనీయం. సంక్షేమ కార్యక్రమాల అమలులో జాతీయస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసలు అందుకుంటున్నది. ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనాలు. ఈసారి రాష్ట్రంలోని ఓటర్లు జాతీయ పార్టీల పేరుతో కూటములుగా ఏర్పడి ఎన్నికల్లో పోటీపడుతున్న వారి తీరును నిరసించాలి. ప్రగతిని కాంక్షించే పార్టీలను సమర్థించాలి. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు, పక్క రాష్ట్ర నాయకత్వాల కింద పనిచేసే పార్టీలు మనకు అవసరం లేదు. అందుకే ఎన్నికల రోజు సెలవుగా భావించవద్దు. ఓటు హక్కు ఉన్న అందరినీ పోలింగ్‌లో పాల్గొనేలా చేయాలి. మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే వారికి తగిన బుద్ధి చెప్పాలి. పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను పరుల పాలు కానివ్వవద్దు. అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెడుతున్న పార్టీని ఆదరించాలి.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *