mt_logo

తెలంగాణ స‌ర‌స్వ‌తీ నిల‌యం.. నిరుపేద బిడ్డ‌లంద‌రికీ విద్యాదానం

  • దేశానికి రోల్‌మాడల్‌గా మ‌న‌ గురుకులాలు
  • ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మ‌ధ్నాహ్న భోజ‌నం
  • ఉచిత పుస్త‌కాలు.. ఉచిత నోట్‌బుక్‌లు
  • విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌.. ఉజ్వ‌ల భ‌విత‌
నాడు భూత్‌బంగ్లాల్లా బడులు..
నేడు కార్పొరేట్‌ భవనాలు!
నాడు నెర్రెలిచ్చిన గోడలు..
నేడు కలర్‌ఫుల్‌ చిత్రాలు!
నాడు విరిగిన బెంచీలు..
నేడు అధునాతన డెస్క్‌లు!
నాడు ఖరాబైన నల్ల బోర్డులు..
నేడు మెరిసే డిజిటల్‌ స్క్రీన్లు
నాడు విద్యాబోధనకు వలంటీర్లు..
నేడు అర్హులైన రెగ్యులర్‌ టీచర్లు!
ఇది స్వరాష్ట్ర పాలన విద్యావిజయం!
చదువుల తల్లికి అగ్రతాంబూలం!!

ఇంగ్లీష్ మీడియం చదువులు.. గురుకులాలు.. గ్రంథాలయాలు.. బోధన, బోధనేతర పోస్టులకు కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు.. మహిళా వర్సిటీ.. సంస్కృత వర్సిటీ.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం ఒక స్టడీ గ్యారేజ్‌ అని అనాల్సిందే. అవును! తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న గురుకుల విద్య ఇప్పుడు దేశానికే రోల్‌మాడల్‌. సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు మన ఊరు-మన బడి పథకాన్ని తీసుకొచ్చి వాటి రూపురేఖలే మార్చేస్తున్నది. ఇంగ్లిష్‌ మీడియం చదువులను ప్రారంభించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నది. ఎక్కడికక్కడ గ్రంథాలయాలు నెలకొల్పుతుంది. ఇటీవలే కొత్తగా తెలంగాణ మహిళా వర్సిటీని ఏర్పాటు చేసింది. సంస్కృత వర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. ఇక, వర్సిటీల్లో బోధన, బోధనేతర పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసేందుకు కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేసింది.

ఉచితంగా నాణ్య‌మైన విద్య‌
-ప్రతి విద్యార్థికి రూ.600 చొప్పున వెచ్చించి 2 జతల యూనిఫాంలు ఉచితంగా ఇస్తున్నది. ఇందుకు గతేడాది రూ.108 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది రూ.140 కోట్ల వరకు వెచ్చించనున్నది.
సర్కారు స్కూళ్లల్లోని 1-10 తరగతుల 26 లక్షల పైచిలుకు విద్యార్థులకు ఏటా రూ.52 కోట్లతో ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేస్తున్నది.
-ఉన్నత విద్యలో తెలంగాణలో పనితీరు మెరుగ్గా ఉన్నది. 
-జాతీయంగా లక్ష విద్యార్థులకు 28 కాలేజీలే ఉండగా, 
తెలంగాణలో లక్ష మందికి 50 కాలేజీలున్నాయి.
-రాష్ట్ర బడ్జెట్‌లో 7.4 శాతం నిధులను విద్యకు కేటాయించింది. 
-ఈ ఏడాది రూ.11,693 కోట్లు కేటాయించగా, 
సగటున ఒక్కో విద్యార్థిపై రూ.50,238 ఖర్చుచేస్తున్నది.
-వర్సిటీలకు కేటాయించే బ్లాక్‌ గ్రాంట్‌ నిధులను సైతం ప్రభుత్వం పెంచుతున్నది. 
-2006-07లో అన్ని వర్సిటీలకు రూ.173.80 కోట్లు వెచ్చించగా, 2018-19లో రూ.812.43 కోట్లకు పెంచారు.
-తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ద్వారా 35 గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి.వాటికి 2019-20లో రూ.147 కోట్లు, 2020-21లో రూ.160 కోట్ల్లు, తాజాగా 172 కోట్లు ఇచ్చారు.
-డిజిటల్‌ క్లాసులకు కోసం సైట్‌ సంస్థ ద్వారా పెద్దఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నది. 2014కు ముందు సైట్‌ బడ్జెట్‌ రూ.300 కోట్లే కాగా, ప్రస్తుతం రూ.451 కోట్లకు చేరింది.
-తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా ఏటా లక్ష విద్యార్థులు లబ్ధి పొందుతుండగా, గతంలో ఈ సంస్థ బడ్జెట్‌ రూ.144.14 కోట్లు కాగా, బడ్జెట్‌ను ప్రభుత్వం రూ.157.64 కోట్లకు పెంచింది.
-ప్రభుత్వ బడుల్లో ప్రాథమిక తరగతులకు తొలిమెట్టు కార్యక్రమం, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ కార్యక్రమాన్ని చేపట్టారు.
-సాంకేతిక విద్యకు ప్రాధాన్యతనిచ్చి కొత్తగా 12 పాలిటెక్నిక్‌ కాలేజీలను మంజూరుచేసింది. 15 పాలిటెక్నిక్‌ కాలేజీలకు సొంత భవనాలు నిర్మించింది. 22 హాస్టళ్లను నిర్మించింది.

ఉన్నత విద్యలో ఉత్తమం
-రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్‌ పేరుతో సింగిల్‌ విండో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా రాష్ట్రంలోని 8 వర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
సాంకేతిక విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. నిధులను పెద్ద ఎత్తున ఖర్చుపెడుతున్నది. 2014-15లో 8 భవనాల నిర్మాణాలకు రూ.20.65 కోట్లు వెచ్చింది.
-ఫలక్‌నుమా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీని డిగ్రీ కాలేజీగా అప్‌గ్రేడ్‌ చేసింది. 2021-22కి గాను వికారాబాద్‌, పరిగి, ఉప్పల్‌, మహేశ్వరంలో కొత్తగా నాలుగు డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది.
ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. రూ.50 కోట్లతో ఈ యూనివర్సిటీని నిర్మించి ఇటీవలే ప్రారంభించింది. సాంకేతిక విద్యాశాఖ ద్వారా 11 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలను ప్రారంభించింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రూ.146 కోట్లతో ప్రపంచస్థాయి ఎడ్యుకేషన్‌ హబ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 20 ఎకరాల్లో బాలికలు, 40 ఎకరాల్లో బాలుర కోసం ఎడ్యుకేషన్‌ హబ్‌లను నిర్మించింది.
-ఇంటర్‌ విద్యార్థులకు రూ.10 కోట్లతో ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేస్తున్నది. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు, లైబ్రరీ, స్పోర్ట్స్‌ వంటి ఫీజులను రద్దు చేసింది.
రూసా పథకం కింద రూ.507 కోట్లు ఖర్చు చేసి, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల అభివృద్ధికి చర్యలు చేపట్టింది.
-కరోనా కష్టకాలంలో 1.2 లక్షల ప్రైవేట్‌ టీచర్లు, సిబ్బందికి రూ.2 వేలు, 25 కిలోల బియ్యాన్ని 3 మాసాల పాటు అందజేసింది.
-తెలంగాణ ఏర్పాటు తర్వాత 8,792 వేలకు పైగా టీచర్‌ పోస్టులను భర్తీ చేసింది. స్కూల్‌ అసిస్టెంట్లు 1,745, ఉర్దూ మీడియం స్కూల్‌ అసిస్టెంట్లు 196, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు 4,779, ఉర్దూ మీడియం సెకండరీ గ్రేడ్‌ టీచర్లు 636, భాషాపండితులు 985, ఉర్దూ మీడియం భాషాపండితులు 26, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు 374, మరో 61 పోస్టులను భర్తీచేసింది.
 అందుబాటులోకి ఆంగ్లమాధ్యమం  
తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో చదివించాలని చూస్తున్నారు. సర్కారు బడుల్లో తెలుగు మీడియంలోనే బోధించడంతో ఇలాంటి వారికి ప్రైవేట్‌ చదువులే దిక్కవుతున్నాయి. దీంతో ఫీజు భారం మోయక తప్పని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 26 వేల సర్కారు బడుల్లో 1-8 తరగతులకు ఇంగ్లిష్‌ మీడియం చదువులను ప్రారంభించారు. రాబోయే విద్యాసంవత్సరం నుంచి 9వ తరగతి వరకు విస్తరించనున్నారు.
మాడల్‌ స్కూళ్లకు బడ్జెట్‌
తెలంగాణ మాడల్‌ స్కూల్స్‌లో 2013-14 నుంచి ఇంగ్లిష్‌ మీడియం బోధన ప్రారంభించారు. 194 మాడల్‌ స్కూళ్లు నడుస్తుండగా వీటిని 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుచేయాల్సి ఉండగా, 2016 తర్వాత కేంద్రం మాడల్‌ స్కూళ్లను ఎత్తివేసింది. ఫలితంగా వీటిని మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తగా, రాష్ట్రంలోని 194 మాడల్‌ స్కూళ్లను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా సొంత నిధులతో నడుపుతున్నది. 2014లో రూ.140 కోట్లున్న మాడల్‌ స్కూళ్ల బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికి రూ.368 కోట్లకు పెంచింది.
ముస్లిం బాలికల ప్రవేశాలు
26 శాతం వృద్ధి 2014-15, 2019-20లో నిర్వహించిన నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే గణాంకాలు తెలంగాణ ముస్లిం బాలికల విద్యాభివృద్ధికి అద్దం పడుతున్నాయి.
ఆ రెండు సర్వేల గణాంకాలపై ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ దళిత్‌ స్టడీస్‌ చేసిన అధ్యయనంలో.. ముస్లిం బాలికల కళాశాల విద్యలో తెలంగాణ దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. గత ఏడేండ్లలో కళాశాల విద్యలో ముస్లిం బాలికల ప్రవేశాల వృద్ధి రేటు జాతీయ సగటు 3 శాతం కాగా, తెలంగాణ వృద్ధి రేటు 26 శాతంగా నమోదైంది.
మన ఊరు – మన బడితో బ‌డుల‌కు కొత్త‌రూపు
సర్కారు బడుల స్వరూపాన్ని సమగ్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమాన్ని చేపట్టింది. మూడు విడుతల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టగా, 2022-23లో మొదటి విడతలో 1,240 బడులు సిద్ధమయ్యాయి. అందులో పూర్తయినవి పూర్తయినట్టు ప్రారంభోత్సవాలు చేశారు. మొత్తం 3 విడతల్లో 3,41,265 డ్యూయల్‌ డెస్క్‌బల్లలు, 1,39,585 గ్రీన్‌ చాక్‌పీస్‌ బోర్డులను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 200కు పైగా విద్యార్థులున్న బడులకు సోలార్‌ విద్యుత్తు కనెక్షన్‌ ఇవ్వనుండగా, మొదటి విడతలో 1,521 బడుల్లో సోలార్‌ ప్యానళ్లు బిగించారు. ప్రభుత్వం ప్రకటించిన 12 అంశాలే కాకుండా పాఠశాలకు స్వాగత తోరణాలు, గ్రీనరీ, పాత్‌వే(నడకదారుల)ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్‌ విద్యలో భాగంగా సర్కారు బడుల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానళ్లు సమకూర్చాలని నిర్ణయం తీసుకోగా, మొత్తంగా 13,983 ప్యానళ్ల్లు అందజేయాలని నిర్ణయించారు. ఇటీవలే వీటిని బిగించే పనులు ప్రారంభమయ్యాయి.
మధ్యాహ్న భోజన పథకంతో స‌త్ఫ‌లితాలు
తెలంగాణ, ఏపీ, కర్ణాటక మాత్రమే 9, 10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నాయి. మిగతా రాష్ర్టాలన్నీ 1-8 తరగతుల వారికి మాత్రమే అందజేస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో మాత్రమే విద్యార్థులకు నెలకు 12 ఉడకబెట్టిన కోడిగుడ్లు అందజేస్తున్నారు. తెలంగాణ మాత్రమే సన్నబియ్యంతో అన్నం పెడుతున్నది.
1-8 తరగతుల విద్యార్థుల కయ్యే వ్యయంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం చొప్పున నిధులను భరిస్తుండగా, తెలంగాణ సర్కారు ఒక అడుగు ముందుకేసి 9, 10 తరగతుల విద్యార్థులకు 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మధ్యాహ్న భోజనాన్ని సమకూరుస్తున్నది.
ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు వారానికి 3 ఉడకబెట్టిన కోడి గుడ్ల చొప్పున, నెలకు 12 కోడిగుడ్లను అందజేస్తున్నది.
రక్తహీనత నివారణ, అదనపు పోషకాహారాన్ని అందజేయడంలో భాగంగా విద్యార్థులకు రాగి జావ, బెల్లం,లేత మొలకలను అందిస్తున్నది.
తెలంగాణ విద్యా విప్ల‌వం
-గురుకులాలు సృష్టించిన సంపద: 930 మంది డాక్టర్లు, 1,517 మంది ఇంజినీర్లు
-నీట్‌, జేఈఈ శిక్షణ 66 సెంటర్లు
-ఎనిమిదేండ్లలో ఉన్నత విద్యాసంస్థల్లో చేరినవారు: 5,450 మంది
-విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం పాఠాలు
-నీట్‌, జేఈఈ పరీక్షలకు శిక్షణ.. ‘మన ఊరు – మన బడి’తో బడులకు మహర్దశ
-సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం.. కొత్తగా మహిళా, సంస్కృత వర్సిటీలు
-బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు