mt_logo

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో వాస్తవాలు ఏంటి? 

వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌ వెళ్లారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు వల్ల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగతుంది. అసలు రేవంత్ దావోస్ పర్యటనలో వాస్తవాలు ఏంటి?

దావోస్‌లో తెలంగాణ పెవిలియన్ డిజైన్ నుంచి మొదలుకుని పరిశ్రమలను ఆహ్వానించే విధంగా రూపొందించిన ప్రచార సామగ్రి అన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించినవే. వాటిలో సీఎం ఫోటో మార్చడం తప్ప కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. 

గతంలో జరిగిన దావోస్ సమావేశాలలో తెలంగాణ స్టాల్ వివిధ దేశాల పారిశ్రామికవేత్తలతో కళకళలాడేది. అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, సీఈవోలు తెలంగాణ స్టాల్ వద్దకే వచ్చి మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిసి చర్చలు జరిపేవారు. కానీ ఈ ఏడాది జరిగిన సమావేశాలలో మాత్రం తెలంగాణ స్టాల్ చాలా సార్లు బోసిపోయి ఉండటం గమనార్హం. 

గత ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడులనే మళ్ళీ కొత్త పెట్టుబడులుగా చిత్రీకరిస్తూ నాలుగు ఫోటోలు దిగడానికే రేవంత్ బృందం పరిమితమైంది అని విమర్శలు వెల్లువెత్తాయి. గత ప్రభుత్వంలో ఫలప్రదమైన చర్చలు జరిపి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినా.. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేక కొందరు పారిశ్రామికవేత్తలు ప్రస్తుతానికి తమ నిర్ణయం పెండింగ్ లో పెట్టారట. గోద్రెజ్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ వంటి సంస్థలు గతంలోనే పెట్టుబడులు పెట్టాయి.. తెలంగాణలో తమ ప్లాంట్ల పనులు కూడా ప్రారంభించాయి.. అలాంటి వాటిని కూడా తాము తీసుకొచ్చిన కొత్త పెట్టుబడులుగా చూపించే ప్రయత్నం చేశారు.

గతంలో అదాని సంస్థ ఎన్నోసార్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించినా.. వాళ్ళు పాటించే వ్యాపార విధానాలు నచ్చక, వాళ్లు కోరే అనుచితమైన ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఇష్టపడక బీఆర్ఎస్ ప్రభుత్వం అదాని సంస్థ పెట్టుబడులకు అంగీకరించలేదు. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదాని సంస్థలకు ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానం పలుకుతుంది.   ప్రకటించిన పెట్టుబడుల్లో హైదరాబాద్‌కు చెందిన గోడి గ్రూప్ మరియు స్టోన్ క్రాఫ్ట్ వంటి చిన్న సంస్థల భారీ పెట్టుబడుల ప్రకటనలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి. 

గతంలో కేటీఆర్ అనేక ముఖ్యమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్యానెల్ డిస్కషన్లలో పాల్గొని గ్లోబల్ బిజినెస్ లీడర్లను మెప్పించిన సందర్భాలు కోకొల్లలు. మరోవైపు రేవంత్ రెడ్డిని ప్యానెల్ డిస్కషన్లలో స్టేజి మీదకు రానివ్వకుండా కేవలం వీక్షకుల కుర్చిలకే పరిమితం చేశారు. కేటీఆర్ అనేక మీడియా సంస్థలతో మాట్లాడుతూ తెలంగాణ పాలసీని ప్రమోట్ చేయగా.. రేవంత్ రెడ్డి మాత్రం తాను ఇచ్చిన ఒకటి రెండు ఇంటర్వ్యూలతోనే తన విషయ పరిజ్ఞాన లోపాన్ని, ఘోరమైన ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని బయపెట్టుకుని, ప్రపంచం ముందు నవ్వుల పాలయ్యాడు.

లూజుగా వేలాడుతున్న సూట్ మరియు క్యాజువల్ టీ-షర్ట్‌ ధరించడంతో, ఒక గ్లోబల్ ఈవెంట్‌కు సరైన వస్త్రధారణ కూడా లేదని పలువురు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డిని దుయ్యబట్టారు.