mt_logo

సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హెలీకి బెస్ట్ విషెస్ తెలిపిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్  ఐక్య‌రాజ్య‌స‌మితి మాజీ అంబాసిడ‌ర్‌, ద‌క్షిణ క‌రోలినా మాజీ గ‌వ‌ర్న‌ర్ నిక్కీ హెలీని క‌లిశారు. అమెరికాపర్యటనలో ఉన్న ఆయ‌న అమెరికా-భారత్ సంబంధాల నేప‌థ్యంలో  తెలంగాణల వ్యూహాత్మక ప్రాముఖ్యతపై ఆమెకు వివరించారు. ఆర్థిక వ్యవస్థ, ఎన్నికలు, రాజకీయాలపై విస్తృతంగా అభిప్రాయాలు పంచుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న ఆమెకు చాలా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా నిక్కీ హెలీతో దిగిన ఫోటోల‌ను త‌న ట్విట్ట‌ర్‌లో కేటీఆర్ పోస్టు చేశారు.