రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. మంగళవారం సంగారెడ్డిలోని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం నివాసంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. పార్టీ ఆదేశానికి కట్టుబడి చింతా ప్రభాకర్‌కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సారి సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగురవేస్తాం అని హామీ ఇచ్చారు. పార్టీ పట్నం మాణిక్యం, ఆయన అనుచరులను కాపాడుకుంటుంది, తెలంగాణ పాల పిట్ట కేసీఆర్ అని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఒకవైపు.. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ పట్టిన వ్యక్తులు మరో వైపు అని తెలిపారు.
ఓటుకు నోటు – నోటుకు సీటు అనే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వ్యక్తి తెలంగాణను ఎలా? అభివృద్ధి చేస్తారని అడిగారు. రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందని సూచించారు. కర్ణాటక రైతులు తమ ప్రభుత్వాలను తిట్టుకుంటుర్రని తెలిపారు.ఇక్కడ పథకాలు అక్కడ ఉన్నాయా? అనడిగారు.
మతం మంటలు కాంగ్రెస్ చరిత్ర అని తెలిపారు. దేశంలో కరెంటు కోతలు ఉంటే మనం నాణ్యమైన కరెంటు ఇస్తున్నామన్నారు. ధరణి వద్దు అంటే పటేల్ పట్వారీ వ్యవస్థ తెస్తారా..? అని మండి పడ్డారు. దరణిలో లోపాలు ఉంటే సరి చేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ కంప్యూటర్ మా నాన్న తెచ్చాడు అన్నారు ఇప్పుడు మేం చేసేంది కంప్యూటరీకరణ అని తెలియజేశారు.